45 ఓవర్ల మ్యాచ్.. అంటే 270 బంతులు.. బహుశా జట్టు 300 పరుగులు మహా అయితే 350 పరుగులు చేసి ఉంటుందని అనుకుంటున్నారు కదూ! అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. బ్యాటింగ్‌కు దిగిన టీం ఏకంగా 7 వికెట్ల నష్టానికి 579 పరుగులు చేసింది. అందులోనూ వన్ డౌన్‌లో దిగిన బ్యాట్స్‌మెన్ ఏకంగా 350 పరుగులు చేశాడు. 27 సిక్సర్లతో బౌలర్లపై వీరవిహారం చేశాడు. అతడెవరో కాదు లియామ్ లివింగ్‌స్టన్. ఈ ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సరిగ్గా ఏడేళ్ల క్రితం డొమెస్టిక్ క్రికెట్‌లో పెను విధ్వంసం సృష్టించాడు.
ప్రస్తుతం ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతోన్న లియామ్ లివింగ్‌స్టన్.. 21 ఏళ్ల వయస్సులో డొమెస్టిక్ క్రికెట్‌లో బౌలర్ల భరతం పట్టాడు. నాంట్‌విచ్ క్రికెట్ క్లబ్ తరపున బరిలోకి దిగిన లియామ్ లివింగ్‌స్టన్ 128 బంతుల్లో 350 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో లివింగ్‌స్టన్ 27 సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. అటు 350 పరుగులలో 162 పరుగులు కేవలం సిక్సర్ల రూపంలోనే రావడం గమనార్హం. లివింగ్‌స్టన్ భారీ ఇన్నింగ్స్‌కు నాంట్‌విచ్ క్రికెట్ క్లబ్ 45 ఓవర్లకు 7 వికెట్లకు 579 పరుగులు చేయగా.. ప్రత్యర్థి జట్టు కేవలం 79 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా నాంట్‌విచ్ క్రికెట్ క్లబ్ 500 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
In 2015, Liam Livingstone scored 350 from 128 balls for Nantwich Cricket Club as a 21-year old. He hit 27 sixes that day, the first coming on the fourth ball of that knock. In the match, Liam’s team scored 579/7 before bowling out the opposition for 79 to win by 500 runs. pic.twitter.com/iqA84Qhlcn
— TheRandomCricketPhotosGuy (@RandomCricketP1) May 3, 2022