సింహం ఎంత వయసొచ్చినా వేటాడటం మర్చిపోదు.. అలాగే షేన్ వాట్సన్ కూడా అంతే! రిటైర్మెంట్ ఇచ్చి ఉండొచ్చు గానీ.. తన బ్యాట్ వేగం ఇంకా తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో షేన్ వాట్సన్ ప్రత్యర్ధి బౌలర్లపై వీరవిహారం చేశాడు. 24 బంతుల్లో 48 పరుగులు చేసిన వాట్సన్.. తన జట్టు భిల్వారా కింగ్స్‌కు అద్భుత విజయాన్ని అందించడమే కాదు.. టోర్నమెంట్ ఫైనల్‌కు చేర్చాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. దిల్షాన్(36), యశ్‌పాల్ సింగ్(43), కెవిన్ ఓ బ్రెయిన్(45), జీవన్ మెండిస్(24) రాణించడంతో ఆ జట్టు భారీ స్కోర్ సాధించగలిగింది. ఇక భిల్వార్ కింగ్స్ బౌలర్లలో శ్రీశాంత్ 2 వికెట్లు.. బ్రెస్నాన్, త్యాగి, రాహుల్ శర్మ, పనేసర్, ఎడ్వర్డ్స్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం 195 పరుగుల టార్గెట్ చేధించే క్రమంలో బరిలోకి దిగిన భిల్వార్ కింగ్స్‌కు ఓపెనర్లు పోర్టర్ ఫీల్డ్(60), వాన్ విక్(31) చక్కటి ఆరంభాన్ని అందించారు. ఇక వన్ డౌన్‌లో వచ్చిన వాట్సన్ అయితే ఎదుర్కున్న తొలి బంతి నుంచి ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 24 బంతుల్లో 48 పరుగులు చేశాడు. అతడికి యూసఫ్ పఠాన్(21), ఇర్ఫాన్ పఠాన్(22) చక్కటి సహకారాన్ని అందించడంతో భిల్వార్ కింగ్స్ జట్టు టార్గెట్‌ను సునాయాసంగా చేధించింది.
Rukenge nahi
It’s a six by @shanewatson #BhilwaraKings #six #shanewatson #LLCT20 pic.twitter.com/wfbGCR53Jr— Bhilwara Kings (@Bhilwarakings) October 3, 2022
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..