
Kuldeep Yadav Wedding : భారత చైనామన్ స్పిన్నర్, టీమిండియా స్టార్ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశిక చద్దాతో కలిసి ఆదివారం (మార్చి 14, 2026) ఏడడుగులు వేశాడు. ఉత్తరాఖండ్‌లోని అత్యంత అందమైన పర్యాటక ప్రాంతం ముస్సోరీలో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. అక్కడి ప్రఖ్యాత హోటల్ సవోయ్ ఈ వేడుకకు వేదికైంది. గతేడాది జూన్ 4న లక్నోలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, కుల్దీప్ బిజీ క్రికెట్ షెడ్యూల్ కారణంగా పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చి, ఎట్టకేలకు ఇప్పుడు ఒక్కటయ్యారు.
పెళ్లి వేడుకలో భాగంగా కుల్దీప్ గుర్రంపై ఊరేగుతూ బరాత్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుల్దీప్ సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పాటు క్రికెట్ ప్రపంచానికి చెందిన దిగ్గజాలు ఈ వేడుకలో సందడి చేశారు. ముఖ్యంగా కుల్దీప్ ప్రాణమిత్రుడు యుజ్వేంద్ర చాహల్, యువ ఆటగాడు తిలక్ వర్మ కలిసి చేసిన డాన్స్ పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రింకూ సింగ్, టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ కూడా బరాత్‌లో హుషారుగా చిందేశారు.
ఈ పెళ్లి వేడుకకు క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, సునీల్ గవాస్కర్, సురేష్ రైనా వంటి ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించినట్లు సమాచారం. కేవలం క్రికెటర్లే కాకుండా, ఆధ్యాత్మిక గురువులు పండిట్ ధీరేంద్ర శాస్త్రి (బాగేశ్వర్ ధామ్), జగద్గురు రాంభద్రాచార్య కూడా విచ్చేసి జంటను దీవించారు. వివాహ వేడుక అంతా అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య, కేవలం ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం ఉండేలా నిర్వహించారు.
World champion Indian cricket team’s star spinner Kuldeep Yadav tied the knot with Vanshika today in Mussoorie, Uttarakhand. pic.twitter.com/kCcIAJ9a1d
— ANI (@ANI) March 14, 2026
The wedding of Kuldeep Yadav and his wife Vanshika was completed today in Mussoorie. 💐❤️ pic.twitter.com/RINuOfd3JV
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 14, 2026
Mussoorie, Uttarakhand: Visuals show Indian cricketer Kuldeep Yadav enjoying his wedding evening with fellow cricketers and other family members. pic.twitter.com/2IidPHVBL1
— IANS (@ians_india) March 14, 2026
ముస్సోరీలో వివాహ పర్వం ముగియడంతో, ఇప్పుడు అందరి కళ్లు లక్నోలో జరగబోయే గ్రాండ్ రిసెప్షన్‌పై పడ్డాయి. మార్చి 17న లక్నోలో భారీ ఎత్తున రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు క్రికెట్ రంగానికి చెందిన వారితో పాటు రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరవుతారని తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా కుల్దీప్-వంశిక జంటకు నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..