AUS vs IND 1st T20I: ఛాంపియన్ ప్లేయర్‌కు మరోసారి షాక్.. తొలి టీ20ఐ నుంచి ఔట్..

Australia vs India 1st T20I: యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా కూడా తుది జట్టులో చోటు దక్కడం కష్టమేనని తెలుస్తోంది. ఇటీవల దేశవాళీ క్రికెట్, వన్డే సిరీస్‌లలో మంచి ప్రదర్శన చేసినప్పటికీ టీ20 ఫార్మాట్‌లో సీనియర్ పేసర్‌లకు ప్రాధాన్యత ఇచ్చేట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ వంటి పేసర్లు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.

AUS vs IND 1st T20I: ఛాంపియన్ ప్లేయర్‌కు మరోసారి షాక్.. తొలి టీ20ఐ నుంచి ఔట్..
Team India

Updated on: Oct 28, 2025 | 2:50 PM

AUS vs IND 1st T20I: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్‌లో తొలి పోరుకు సర్వం సిద్ధమైంది. అక్టోబర్ 29న కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న యువ భారత జట్టుకు ఇది కీలక పరీక్ష కానుంది. ఈ నేపథ్యంలో, తొలి టీ20ఐకి భారత తుది జట్టు (ప్లేయింగ్ XI) ఎలా ఉండబోతుందనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా, స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు మరోసారి చోటు దక్కకపోవడం, యువ పేసర్ హర్షిత్ రాణా కూడా తప్పించాలని మాజీలు కోరుతున్నారు.

కుల్దీప్‌కు మళ్లీ నిరాశ..

వన్డే ఫార్మాట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ, టీ20ఐ ఫార్మాట్‌లో కుల్దీప్ యాదవ్‌కు నిలకడగా తుది జట్టులో చోటు దక్కడం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన గత టీ20ఐ సిరీస్‌లలో కూడా అతనికి తరచుగా విశ్రాంతినిస్తున్నారు. కాన్‌బెర్రా పిచ్ స్వభావం, జట్టు కూర్పు దృష్ట్యా, మేనేజ్‌మెంట్ మణికట్టు స్పిన్నర్ అయిన కుల్దీప్‌కు బదులు వేరే స్పిన్ ఎంపికల వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అక్షర్ పటేల్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో, కుల్దీప్ యాదవ్‌కు బెంచ్‌కే పరిమితం కాక తప్పలేదు.

హర్షిత్ రాణాకు నిరాశ..

యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా కూడా తుది జట్టులో చోటు దక్కడం కష్టమేనని తెలుస్తోంది. ఇటీవల దేశవాళీ క్రికెట్, వన్డే సిరీస్‌లలో మంచి ప్రదర్శన చేసినప్పటికీ టీ20 ఫార్మాట్‌లో సీనియర్ పేసర్‌లకు ప్రాధాన్యత ఇచ్చేట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ వంటి పేసర్లు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. హర్షిత్ రాణా భవిష్యత్తులో మంచి అవకాశాలు దక్కించుకునే అవకాశం ఉన్నా, ప్రస్తుతానికి అతనికి బెంచ్‌లో కూర్చోవాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో టీమిండియా మాజీ ప్లేయర్ పార్థివ్ పటేల్ టీమిండియా ప్లేయింగ్ 11ను ఎంచుకున్నాడు. కేవలం ఇద్దరు స్పిన్నర్లను సూచించాడు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎంచుకున్నాడు. అలాగే, శివం దుబే, నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఇద్దరు పేస్-బౌలింగ్ ఆల్-రౌండర్లతో నిండిన లైనప్‌తో వెళ్లాలని తెలిపాడు.

ఇటీవల టీ20ఐలలో బరిలోకి దిగిన టాప్ ఆర్డర్‌తోనే పార్థివ్ కొనసాగాలని సూచించాడు. ఇందులో అభిషేక్ శర్మ , వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, తిలక్ వర్మ , కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఉన్నారు. అతను ఇద్దరు ఫ్రంట్‌లైన్ పేసర్లను కూడా ఎంచుకున్నాడు. పేస్ స్పియర్‌హెడ్ జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లను ఎంచుకున్నాడు. అయితే, సిడ్నీలో జరిగిన మూడవ వన్డేలో భారత జట్టు విజయంలో నాలుగు వికెట్లు తీసిన హర్షిత్ రాణాను పక్కన పెట్టాడు. రింకు సింగ్ , జితేష్ శర్మ వంటి ఆటగాళ్లకు కూడా పార్థివ్ జట్టులో చోటు దక్కలేదు.

పార్థివ్ పటేల్ ఎంపిక చేసిన తొలి టీ20కి భారత ఎలెవన్ (India Playing XI vs Aus 1st T20I): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి , అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..