ఎట్టకేలకు తెలుగు తేజం అదరగొట్టాడు. వికెట్ కీపింగ్‌లో అదరగొడుతున్నా.. బ్యాటింగ్‌లో నిరాశపరుస్తోన్న టీమిండియా వికెట్ కీపర్ కే.ఎస్.భరత్ ఆసీస్‌పై స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడాడు. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసి ఔటయ్యాడు భరత్. మొత్తం 88 బంతులు ఎదుర్కొన్న అతను 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44 రన్స్ చేసి లయోన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే కోహ్లీతో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అంతేకాదు ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌కు కాసేపు చుక్కలు చూపించాడు. గ్రీన్ వేసిన ఒక ఓవర్‌లో వరసగా 6,6,4 కొట్టి షాకిచ్చాడు. ఆ ఓవర్‌లో మొత్తం 21 పరుగులు వచ్చాయి. భరత్ ఊపు చూస్తుంటే అర్ధసెంచరీ చేస్తాడనుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ లయోన్‌కు చిక్కాడు. కాగా కామెరూన్ గ్రీన్ ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.17.50 కోట్లకు అమ్ముడైన సంగతి తెలిసిందే.
రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన భరత్ కీపింగ్‌లో తన ట్యాలెంట్ చూపిస్తున్నాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం పెద్దగా రాణించలేదు. అయితే నాలుగో టెస్టులో వేగంగా పరుగులు చేసి టీమిండియా భారీ స్కోరుకు బాటు వేశాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. కడపటి వార్తలందే సమయానికి టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 563 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 183 పరుగులతో డబులు సెంచరీ దిశగా దూసుకెళుతున్నాడు. అక్షర్ పటేల్ 79 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 83 పరుగుల ఆధిక్యంలో ఉండి. కాగా ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం ఖాయం.
KS Bharat joins in with a fine contribution!
Pushing India’s score closer to Australia’s#INDvsAUS #BGT2023 pic.twitter.com/DMu8tbvRuA— OneCricket (@OneCricketApp) March 12, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..