KKR vs SRH: కోల్‌కతా ముందు భారీ టార్గెట్.. ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీ.. దంచి కొట్టిన రూ.13 కోట్ల హైదరాబాద్ ప్లేయర్..

|

Apr 14, 2023 | 9:22 PM

తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 228 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా ముందు 229 పరుగుల టార్గెట్ నిలిచింది. బ్రూక్ ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు.

KKR vs SRH: కోల్‌కతా ముందు భారీ టార్గెట్.. ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీ.. దంచి కొట్టిన రూ.13 కోట్ల హైదరాబాద్ ప్లేయర్..
Harry Brook Century
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16వ సీజన్‌లో 19వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగుతోంది. కోల్‌కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 228 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా ముందు 229 పరుగుల టార్గెట్ నిలిచింది. బ్రూక్ ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు.

32 పరుగుల వద్ద అభిషేక్ శర్మ ఔటయ్యాడు. ఆండ్రీ రస్సెల్ బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ చేతికి చిక్కాడు. బ్రూక్‌తో కలిసి అభిషేక్ 33 బంతుల్లో 72 పరుగుల అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఇవి కూడా చదవండి

29 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ ఔటయ్యాడు. మార్క్రామ్‌కి ఇది నాలుగో అర్ధ సెంచరీ. రాహుల్ త్రిపాఠి 9 పరుగుల వద్ద అవుటయ్యాడు. మయాంక్ అగర్వాల్ 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

ఇరు జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(సి), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్(w), మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), N జగదీసన్, నితీష్ రాణా(c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..