Watch Video: 6 బంతులు, 5 పరుగులు, 4 వికెట్లు.. రస్సెల్ దెబ్బకు గుజరాత్ డీలా.. ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా రికార్డ్..

|

Apr 23, 2022 | 6:37 PM

గుజరాత్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో ఆండ్రీ రస్సెల్‌ బౌలింగ్‌కు వచ్చాడు. రాగానే గుజరాత్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 6 బంతుల్లో 5 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి టైటాన్స్ జట్టును షేక్ చేశాడు.

Watch Video: 6 బంతులు, 5 పరుగులు, 4 వికెట్లు.. రస్సెల్ దెబ్బకు గుజరాత్ డీలా.. ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా రికార్డ్..
Kkr Vs Gt Kolkata Knight Riders Bowler Andre Russell
Follow us on

గుజరాత్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో ఆండ్రీ రస్సెల్‌ బౌలింగ్‌కు వచ్చాడు. రాగానే గుజరాత్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 6 బంతుల్లో 5 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి టైటాన్స్ జట్టును షేక్ చేశాడు. ఓవర్ తొలి రెండు బంతుల్లోనే అభినవ్ మనోహర్ (2), లాకీ ఫెర్గూసన్ (0)లను అవుట్ చేశాడు. వీరిద్దరూ డీప్ మిడ్ వికెట్ వద్ద రింకూ సింగ్ చేతికి చిక్కారు. ఓవర్ 5వ బంతికి రాహుల్ తెవాటియా (17)ను రస్సెల్ అవుట్ చేశాడు. ఈసారి కూడా రింకూ సింగ్ క్యాచ్ పట్టగా, చివరి బంతికి యష్ దయాల్ సున్నాకి ఔటయ్యాడు. మొత్తం మ్యాచ్‌లో కేవలం 1 ఓవర్‌లో 4 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా రస్సెల్ నిలిచాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా నిలిచాడు. చివరి 5 ఓవర్లలో గుజరాత్ 7 వికెట్ల నష్టానికి 29 పరుగులు మాత్రమే చేసింది. ఐపీఎల్‌లో రషీద్ ఖాన్ 11వ సారి సున్నాకి ఔటయ్యాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఒక ఓవర్‌లో 3 వికెట్లు మాత్రమే తీసిన రికార్డు ఉంది. ప్రస్తుతం దీనిని రస్సెల్ బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర నెలకొల్పాడు.

మ్యాచ్ పరిస్థితి..

కోల్‌కతాకు గుజరాత్ 157 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా వరుసగా మూడో అర్ధశతకం సాధించి అత్యధికంగా 67 పరుగులు చేశాడు. కేకేఆర్ తరపున ఆండ్రీ రస్సెల్ 4 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని ఐపీఎల్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: KKR vs GT Score: అర్థసెంచరీతో ఆకట్టుకున్న హార్దిక్.. ఒకే ఓవర్‌లో 4 వికెట్లతో సత్తా చాటిన రస్సెల్.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?

DC Vs RR: నో బాల్‌ ఇవ్వకుంటే బయటకు వచ్చేయండి.. క్రీజ్‌లో ఉన్న ఆటగాళ్లకు రిషబ్ పంత్‌ పిలుపు..