
IND vs AUS: భారత క్రికెట్ అభిమానులంతా ఆస్ట్రేలియాలో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, ఈ సిరీస్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఒక నివేదిక ప్రకారం.. ఈ ఇద్దరూ ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు ఇండియా-ఎ జట్టు తరఫున ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఆడటం అసాధ్యం అని తెలుస్తోంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. ఒక సీనియర్ బీసీసీఐ అధికారి ఈ విషయంపై స్పందించారు. “వారిద్దరూ ఇండియా-ఎ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడటం దాదాపుగా అసాధ్యం. ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ వారిపై ఒత్తిడి తీసుకురారు” అని ఆ అధికారి తెలిపారు. బీసీసీఐ 2025లో విడుదల చేసిన 10 పాయింట్ల నిబంధన ప్రకారం.. గాయాలు లేని సీనియర్ ఆటగాళ్ళందరూ దేశవాళీ క్రికెట్‌లో అందుబాటులో ఉండాలి. కానీ కోహ్లీ, రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నందున వారికి ఇండియా-ఎ మ్యాచ్‌లలో ఆడాలని బలవంతం చేయరు. “వారికి కొద్దిగా మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం అనుకుంటే, ఆస్ట్రేలియా వన్డేల ముందు ఒకటో, రెండో మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. కానీ ఇంకా ఏమీ ఖరారు కాలేదు” అని ఆ అధికారి వివరించారు.
అయితే, కోహ్లీ, రోహిత్ ఇద్దరూ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికకు అందుబాటులో ఉన్నారని కన్ఫాం అయింది. “వారిద్దరూ పూర్తి ఫిట్‌గా ఉన్నారు. ఆస్ట్రేలియా వన్డేలకు అందుబాటులో ఉన్నారు” అని ఆయన చెప్పారు. 36, 38 సంవత్సరాల వయస్సు ఉన్న కోహ్లీ, రోహిత్..ఇటీవల 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం రోహిత్ ఇంకా వన్డే జట్టు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, టెస్ట్ జట్టు కెప్టెన్‌గా 25 ఏళ్ల శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన తర్వాత, రోహిత్ భవిష్యత్తుపై సందేహాలు తలెత్తుతున్నాయి. భారత్-ఎ, ఆస్ట్రేలియా-ఎ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌లు సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, అక్టోబర్ 5న స్వదేశంలో జరుగుతాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..