IPL 2025: శ్రేయాస్ అయ్యర్ సిస్టర్ ఎవరో తెల్సా.. ఒక్క పాటతోనే ఇండస్ట్రీని ఊపేసింది

శ్రేయాస్ అయ్యర్ కు ఓ సిస్టర్ ఉన్న సంగతి తెలిసిందే. ఆమె బాలీవుడ్ లో ఫేమస్ సెలబ్రిటీ. ఒక్క పాటత్గో ఇండస్ట్రీని ఊపేసింది. మరి ఆమె గురించి ఆసక్తికర విషయాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ లుక్కేయండి.

IPL 2025: శ్రేయాస్ అయ్యర్ సిస్టర్ ఎవరో తెల్సా.. ఒక్క పాటతోనే ఇండస్ట్రీని ఊపేసింది
Shreyas Iyer

Updated on: Apr 19, 2025 | 6:32 PM

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు శ్రేయాస్ అయ్యర్. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా అయిదింట విజయం అందించి.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో పంజాబ్‌ను నిలిపాడు అయ్యర్. మనోడి ఆట చూసేందుకు.. అతడి కుటుంబం స్టేడియం‌కు వస్తుంటుంది. ఇక తమ్ముడి శ్రేయాస్ అయ్యర్‌ను దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తుంది అతడి సోదరి శ్రేష్ట అయ్యర్.

క్రికెట్ గ్యాలరీలో తమ్ముడిని ఉత్సాహపరుస్తూ.. అప్పుడప్పుడూ కెమెరాల దృష్టిని ఆకర్షిస్తుంది శ్రేష్ట అయ్యర్. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇంతకీ శ్రేష్ట గురించి పలు ఆసక్తికర విషయాలు మీకు తెల్సా.. శ్రేష్ట అయ్యర్.. ఇన్‌స్టాలో తెగ ఫేమస్ సెలబ్రిటీ. కొరియోగ్రాఫర్‌గా, ప్రొఫెషనల్ డ్యాన్సర్‌గా రాణిస్తోంది. ఇటీవల ఓ స్పెషల్ సాంగ్‌ ద్వారా బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది శ్రేష్ట. ఒక్క సాంగ్‌తోనే తన అందచందాలతో ఇండస్ట్రీని ఊపు ఊపేసింది.

‘సర్కారీ బచ్చా’ అనే సినిమాలో ‘అగ్రిమెంట్‌ కర్లే’ అంటూ సాగే ఈ పాటకు హుషారైన స్టెప్పులేసింది శ్రేష్ట. ఇక అమ్మడికి ఇన్‌స్టాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నెట్టింట ఆమె షేర్ చేసే ఫొటోలకు, వీడియోలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. లేట్ ఎందుకు మీరూ ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి.