IPL 2025: పంత్ శాలరీ రూ. 27 కోట్లు కాదు.. భారీగా కోత పడిందిగా.. చేతికందేది ఎంతో తెలిస్తే షాకే?
Rishabh Pant Salary in IPL 2025: ఒక ఆటగాడు టోర్నమెంట్‌కు ముందు గాయపడి, సీజన్ మొత్తం దూరమైతే, అతనికి ఎలాంటి చెల్లింపు ఉండదు. అయితే, టోర్నమెంట్ మధ్యలో గాయపడితే, ఆడిన మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా లేదా పూర్తి జీతం చెల్లించే విధానాలు కూడా ఫ్రాంచైజీల ఒప్పందంపై ఆధారపడి ఉంటాయి.

Rishabh Pant Salary in IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు రిషబ్ పంత్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పంత్ నిలిచాడు. అయితే, పంత్‌కు ఈ మొత్తం రూ. 27 కోట్లు పూర్తిగా చేతికి అందవు అని మీకు తెలుసా. ప్రస్తుతం ఐపీఎల్ లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. ప్లే ఆఫ్స్ రేపట నుంచి మొదలుకానున్నాయి. అయితే, రిషబ్ పంత్ కెప్టెన్సీలోనే లక్నో సూపర్ జెయింట్స్ టీం ప్లే ఆఫ్ చేరుకోలేకపోయింది. దీంతో పంత్ శాలరీపైనా ఎఫెక్ట్ పడిందంటూ నెటిజన్లు మాట్లాడుకుంటుకున్నారు. అసలు పంత్ జీతం ఎంత, వేలంలో దక్కించుకున్న రూ. 27 కోట్లలో చేతికి ఎంత అందుకోనున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
రూ. 27 కోట్ల వెనుక ఉన్న నిజం..
భారత ప్రభుత్వం విధించే ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, ఐపీఎల్ ఆటగాళ్ల జీతాలపై పన్ను విధించబడుతుంది. పంత్ అందుకునే రూ. 27 కోట్ల జీతంపై 30 శాతం ఆదాయపు పన్ను, 25 శాతం సర్ఛార్జి (కొన్ని సందర్భాలలో), 4 శాతం సెస్ వర్తిస్తాయి. ఈ పన్నులు, సెస్సులు పోను పంత్ చేతికి వచ్చే మొత్తం దాదాపు రూ. 16.47 కోట్ల నుంచి రూ. 18.9 కోట్లు వరకు ఉండవచ్చు.
పన్నుల భారం..
- ఆదాయపు పన్ను (Income Tax): ఆటగాళ్ల జీతాలపై 30% ఆదాయపు పన్ను వసూలు చేస్తారు. అంటే, రూ. 27 కోట్లలో దాదాపు రూ. 8.06 కోట్లు ఆదాయపు పన్నుకే చెల్లించాల్సి ఉంటుంది.
- సర్ఛార్జి (Surcharge): పంత్ వంటి అధిక ఆదాయం ఉన్న ఆటగాళ్లకు వర్తించే సర్ఛార్జి 25% వరకు ఉంటుంది. ఇది పన్ను మొత్తానికి అదనంగా విధిస్తారు.
- సెస్ (Cess): విద్యా సెస్ (Education Cess), ఆరోగ్య సెస్ (Health Cess) వంటివి కూడా వర్తిస్తాయి. ఇవి సుమారు 4% వరకు ఉంటాయి.
ఈ పన్నులు, సెస్సులు అన్నీ కలిపి తీసివేస్తే, పంత్‌కు చేతికి వచ్చే మొత్తం గణనీయంగా తగ్గుతుంది.
ఫ్రాంచైజీల చెల్లింపు విధానం..
ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆటగాళ్ల జీతాలను ఒకేసారి చెల్లించవు. సాధారణంగా, 15-65-20 ఫార్ములాను అనుసరిస్తుంటాయి.
- 15%: ఆటగాడు ఐపీఎల్ ఆడేందుకు వచ్చినప్పుడు, సీజన్ ప్రారంభంలో 15% జీతం చెల్లిస్తారు.
- 65%: మొదటి అర్ధభాగం మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత, 65% జీతం చెల్లిస్తారు.
- 20%: ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత, మిగిలిన 20% జీతం చెల్లిస్తారు.
అయితే, బీసీసీఐ నిబంధనల ప్రకారం, ఫ్రాంచైజీలు తమ సౌలభ్యాన్ని బట్టి ఒకేసారి లేదా రెండు, మూడు వాయిదాలలో పూర్తి జీతాన్ని చెల్లించవచ్చు. కాగా, మీడియా నివేదికల ప్రకారం, రిషబ్ పంత్ ఐపీఎల్ జీతం రూ. 15.52 కోట్లుగా ఉంటుందని చెబుతున్నారు. రిషబ్ పంత్ ప్రయాణం, బస, మేనేజర్ ఫీజులు మొదలైన భాగాలను విడిగా క్లెయిమ్ చేస్తే దాదాపు రూ.1 కోటి పన్ను ఆదా చేయవచ్చు. ఈ సందర్భంలో అతని జీతం రూ.16.47 కోట్లు అవుతుందని చెబుతున్నారు.
గాయపడిన ఆటగాళ్ల పరిస్థితి:
ఒక ఆటగాడు టోర్నమెంట్‌కు ముందు గాయపడి, సీజన్ మొత్తం దూరమైతే, అతనికి ఎలాంటి చెల్లింపు ఉండదు. అయితే, టోర్నమెంట్ మధ్యలో గాయపడితే, ఆడిన మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా లేదా పూర్తి జీతం చెల్లించే విధానాలు కూడా ఫ్రాంచైజీల ఒప్పందంపై ఆధారపడి ఉంటాయి. భారత ఆటగాళ్లు టీమిండియా తరపున ఆడుతూ గాయపడితే, బీసీసీఐ బీమా పాలసీ ప్రకారం పూర్తి జీతం పొందుతారు.
కాబట్టి, రిషబ్ పంత్ రూ. 27 కోట్లకు కొనుగోలు చేయబడినప్పటికీ, పన్నుల భారం, చెల్లింపు విధానాల కారణంగా అతని చేతికి వచ్చే మొత్తం వేలం ధర కంటే గణనీయంగా తక్కువగా ఉంటుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








