AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KL Rahul : లార్ట్స్ లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా రికార్డు

కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. లార్డ్స్ వంటి ప్రతిష్టాత్మక మైదానంలో సెంచరీ సాధించి, ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతని ఈ అద్భుత ప్రదర్శన తర్వాత దిలీప్ వెంగ్సర్కర్‌తో ఉన్న రికార్డు జాబితాలో చోటు సంపాదించుకున్నాడు.

KL Rahul : లార్ట్స్ లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా రికార్డు
Kl Rahul
Rakesh
|

Updated on: Jul 12, 2025 | 7:31 PM

Share

KL Rahul : లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన రెండో భారత క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‎లో అతను 176 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. ఇది ఈ సిరీస్‌లో రాహుల్‌కు రెండో సెంచరీ అతని టెస్ట్ కెరీర్‌లో 10వ సెంచరీ. రాహుల్‌కు ముందు ఒకే ఒక్క భారత బ్యాట్స్‌మెన్ మాత్రమే లార్డ్స్‌లో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు సాధించగలిగాడు.

లార్డ్స్ టెస్ట్‌లో కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్‎తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. జైస్వాల్ 13 పరుగులకే అవుట్ అయినప్పటికీ, రాహుల్ ఒక ఎండ్‌లో గట్టిగా నిలబడ్డాడు. మొదట కరుణ్ నాయర్‎తో కలిసి 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత రిషబ్ పంత్‎తో కలిసి 141 పరుగుల భాగస్వామ్యంతో భారత జట్టును గెలుపు రేసులో నిలబెట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో పంత్ 74 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.

లార్డ్స్ మైదానంలో కేఎల్ రాహుల్‌కు ఇది రెండో సెంచరీ. ఈ చారిత్రక మైదానంలో అతని మొదటి టెస్ట్ సెంచరీ 2021లో ఇంగ్లాండ్‌పై 129 పరుగులు చేసినప్పుడు సాధించాడు. ఇక భారత్ తరపున లార్డ్స్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ దిలీప్ వెంగ్సర్కర్. అతను ఈ మైదానంలో మొత్తం 3 సెంచరీలు చేసి, భారత్ నుంచి మాత్రమే కాకుండా, లార్డ్స్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆసియా బ్యాట్స్‌మెన్గా కూడా రికార్డు సృష్టించాడు.

లార్డ్స్ మైదానంలో ఇప్పటివరకు భారత్ తరపున 10 మంది బ్యాట్స్‌మెన్‌లు టెస్ట్ మ్యాచ్‌లలో సెంచరీలు సాధించారు. ఈ ఘనత సాధించిన మొదటి భారత ఆటగాడు వినూ మంకాడ్. అతని తర్వాత దిలీప్ వెంగ్సర్కర్, గుండప్ప విశ్వనాథ్, రవి శాస్త్రి, మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, అజిత్ అగార్కర్, రాహుల్ ద్రావిడ్, అజింక్య రహానే , ఇప్పుడు కేఎల్ రాహుల్ ఈ జాబితాలో చేరారు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..