Video: దటీజ్ వైభవ్ సూర్యవంశీ.. దిగ్గజాన్నే ‘ఫ్యాన్ బాయ్’గా మార్చేసిన 15 ఏళ్ల బుడ్డోడు..!

Justin Langer Fanboy Moment With Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే స్టార్ బౌలర్ల గుండెల్లో వణుకు పుట్టిస్తూ, దిగ్గజ కోచ్‌లే తనతో ఫోటో కోసం వచ్చేలా చేసుకున్న వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్ భవిష్యత్ నయా సంచలనంగా మారుతున్నాడు. రాబోయే రోజుల్లో ఈ యువ కిరణం మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

Video: దటీజ్ వైభవ్ సూర్యవంశీ.. దిగ్గజాన్నే ఫ్యాన్ బాయ్గా మార్చేసిన 15 ఏళ్ల బుడ్డోడు..!
Video Justin Langer Fanboy Moment With Vaibhav Sooryavanshi

Updated on: May 20, 2026 | 7:38 PM

Justin Langer Fanboy Moment With Vaibhav Sooryavanshi: ఐపీఎల్ (IPL) చరిత్రలో ఎంతో మంది దిగ్గజాలు మైదానంలోకి అడుగుపెట్టారు. కానీ, కేవలం 15 సంవత్సరాల వయసులోనే ప్రపంచ క్రికెట్ దిగ్గజాలను తన బ్యాటింగ్‌తో మంత్రముగ్ధులను చేస్తూ, తన ఆటోగ్రాఫ్ లేదా ఫోటో కోసం వారు క్యూ కట్టేలా చేస్తున్నాడు ఒక యువ సంచలనం. ఆయనే రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.

లక్నో సూపర్‌ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో ఈ యువ బ్యాటర్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ చూసి, ఆ జట్టు ప్రధాన కోచ్, ఆస్ట్రేలియా లెజెండ్ జస్టిన్ లాంగర్ సైతం అతనితో ఫోటో దిగడానికి ఒక సాధారణ అభిమానిలా మారిపోయారు.

ఇవి కూడా చదవండి

లైవ్ ఇంటర్వ్యూను ఆపి మరీ ఫోటో అడిగిన లాంగర్..

లక్నోపై రాజస్థాన్ విజయం సాధించిన తర్వాత, వైభవ్ సూర్యవంశీ బ్రాడ్‌కాస్టర్స్‌తో లైవ్ డిజిటల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన జస్టిన్ లాంగర్.. ఆ రికార్డింగ్‌ను కాసేపు ఆపమని కోరారు. తన మొబైల్ చేత్తో పట్టుకుని వైభవ్ వద్దకు వచ్చి, అత్యంత వినయంగా “నేను నీతో ఒక ఫోటో దిగొచ్చా?” అని అడిగారు.  వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి: ఎవర్రా మీరంతా.. మీరు, మీ ఆట తగలెయ్యా.. ఏరికోరి తెస్తే.. ఫ్రాంచైజీలకే వెన్నుపోటు పోడిచిన నలుగురు..

క్రికెట్ ప్రపంచంలో ఎంతో అనుభవం ఉన్న ఒక సీనియర్ కోచ్ అలా అడగడంతో వైభవ్ కూడా ఎంతో గౌరవంగా “ఎస్ సార్, ప్లీజ్” అంటూ లాంగర్‌తో ఫోటో దిగాడు. ఇద్దరూ కరచాలనం చేసుకున్న తర్వాత లాంగర్ మాట్లాడుతూ.. “ఈ ఫోటోను నేను ఎప్పటికీ ఒక నిధిలా దాచుకుంటాను” అని అనడం విశేషం. “నీ కెరీర్‌కు ఆల్ ది బెస్ట్.. చాలా బాగా ఆడుతున్నావు!” వైభవ్‌ను అభినందించాడు జస్టిన్ లాంగర్.

మైదానంలో పరుగుల సునామీ.. రికార్డుల వేట!

ఈ మ్యాచ్‌లో లక్నో నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో వైభవ్ సూర్యవంశీ కేవలం 38 బంతుల్లోనే 93 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే.. ఐపీఎల్ కాస్ట్లీ ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ..!

50 సిక్సర్ల మైలురాయి: ఒకే ఐపీఎల్ సీజన్‌లో 50 కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి భారతీయ బ్యాటర్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు.

ఆరెంజ్ క్యాప్ హోల్డర్: ప్రస్తుత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.

స్ట్రైక్ రేట్ రికార్డ్: ఈ సీజన్‌లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లలో 236 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో అత్యంత వేగంగా ఆడుతున్న ఆటగాడిగా నిలిచాడు.

బౌలర్లను భయపెడుతున్న 15 ఏళ్ల కుర్రాడు..

మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జస్టిన్ లాంగర్ వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. “నేను 35 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను చూశాను. కానీ 15 ఏళ్ల వయసులో ఈ తరహా బ్యాటింగ్ చూడడం అద్భుతం. మిచెల్ స్టార్క్, అన్రిచ్ నోర్ట్జే లాంటి ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్లను అతను కొడుతుంటే, ఆ బౌలర్ల ముఖాల్లో ‘అసలు ఏం జరుగుతోంది ఇక్కడ?’ అనే భయం కనిపిస్తోంది. ఇంకా పూర్తిగా బ్యాటింగ్ నేర్చుకోకముందే ఇంత విధ్వంసం సృష్టిస్తుంటే, భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్‌కు ఇదో హెచ్చరిక” అని లాంగర్ పేర్కొన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us