Jos Buttler: శ్రీలంకపై సెంచరీ బాదిన ఇంగ్లీష్‌ వికెట్‌ కీపర్.. 67 బంతుల్లోనే 101 పరుగులు.. టీ 20లో ఫస్ట్‌ సెంచరీ

|

Nov 01, 2021 | 10:01 PM

Jos Buttler: T20 ప్రపంచ కప్ 2021లో భాగంగా 29వ మ్యాచ్‌ శ్రీలంక, ఇంగ్లాండ్ మధ్య షార్జాలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ వికెట్‌ కీపర్ జోస్ బట్లర్ రచ్చ సృష్టించాడు.

Jos Buttler: శ్రీలంకపై సెంచరీ బాదిన ఇంగ్లీష్‌ వికెట్‌ కీపర్.. 67 బంతుల్లోనే 101 పరుగులు.. టీ 20లో ఫస్ట్‌ సెంచరీ
Jos Buttler
Follow us on

Jos Buttler: T20 ప్రపంచ కప్ 2021లో భాగంగా 29వ మ్యాచ్‌ శ్రీలంక, ఇంగ్లాండ్ మధ్య షార్జాలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ వికెట్‌ కీపర్ జోస్ బట్లర్ రచ్చ సృష్టించాడు. ఏకంగా సెంచరీ బాదేశాడు. కేవలం 67 బంతుల్లోనే 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. షార్జా పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైనప్పటికీ ఇంగ్లిష్ వికెట్‌కీపర్ తన క్లాస్‌ని ప్రదర్శించి ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేశాడు. 2021 T20 ప్రపంచ కప్‌లో బట్లర్ మొదటి సెంచరీ హీరో అయ్యాడు.

మొదట నెమ్మదిగా బ్యాటింగ్‌ ప్రారంభించిన బట్లర్ తర్వాత పిచ్‌ని అర్థం చేసుకొని సులువుగా ఆడాడు. ఒకవైపు నుంచి ఇంగ్లండ్‌ వికెట్లు పడుతున్నా బట్లర్‌ తన ఆటను ఎక్కడా తగ్గకుండా కొనసాగించాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఒక సిక్స్, నాలుగు ఫోర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. తర్వాత శ్రీలంక బౌలర్లపై ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. 22 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో బట్లర్ మరో 5 సిక్సర్లు బాదాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్సర్ కొట్టి బట్లర్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. మోర్గాన్‌తో కలిసి బట్లర్ 78 బంతుల్లో 112 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. బట్లర్ ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లండ్ జట్టు 10 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది.

బట్లర్ నంబర్ 1 బ్యాట్స్‌మెన్
జోస్ బట్లర్ ఇప్పుడు తన సెంచరీ ఇన్నింగ్స్ ఆధారంగా T20 ప్రపంచ కప్ 2021లో నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా మారాడు. ఈ బ్యాట్స్‌మెన్ 4 మ్యాచ్‌ల్లో 214 సగటుతో 214 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, హాఫ్ సెంచరీ కూడా ఉంది. కేవలం 4 మ్యాచ్‌ల్లోనే బట్లర్ 12 సిక్సర్లు, 15 ఫోర్లు కొట్టాడు. బట్లర్ ఈ ఫామ్ ఇంగ్లండ్‌కు చాలా శుభవార్త ఎందుకంటే ఈ ఆటగాడి బ్యాట్ ఇలాగే కొనసాగితే ఇంగ్లీష్ జట్టు రెండోసారి T20 ప్రపంచ కప్‌ను గెలుచుకునే అవకాశం ఉంటుంది.

Viral Video: పడగ విప్పిన నాగుపాములు.. ఆట చూస్తే అదరిపోవాల్సిందే..!

Huzurabad By Election Results: హుజూరాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. మధ్యాహ్నం 3 గంటల్లోగా తుది ఫలితం..

Raghava Lawrence: మరోసారి రాఘవేంద్రస్వామి మీద భక్తిని చాటుకున్న నటుడు .. దేశంలోనే అతిపెద్ద విగ్రహం తయారీ