Video: జాంటీ రోడ్స్ బ్రదర్‌లా ఉన్నాడే.. గాల్లోకి ఎగిరి, ఒంటి చెత్తో కళ్లు చెదిరే క్యాచ్.. షాక్‌లో బ్యాటర్..

|

Feb 06, 2023 | 9:10 PM

Pretoria Capitals vs Durban Super Giants: ఎస్ఏ20లో ప్రిటోరియా క్యాపిటల్స్ ప్లేయర్ జిమ్మీ నీషమ్ అద్భుతమైన క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

Video: జాంటీ రోడ్స్ బ్రదర్‌లా ఉన్నాడే.. గాల్లోకి ఎగిరి, ఒంటి చెత్తో కళ్లు చెదిరే క్యాచ్.. షాక్‌లో బ్యాటర్..
Jimmy Neesham
Follow us on

ఎస్ఏ20 (SA20) లీగ్‌లో, టోర్నమెంట్‌లోని 28వ మ్యాచ్ ప్రిటోరియా క్యాపిటల్స్ వర్సెస్ డర్బన్ సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ ప్లేయర్ జిమ్మీ నీషమ్ అద్భుతమైన క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ క్యాచ్‌ని పట్టుకోవడానికి నీషమ్ గాలిలో లాంగ్ జంప్ చేశాడు. నీషమ్ ఈ క్యాచ్ ప్రస్తుతం నెట్టింట్లో దూసుకపోతోంది. ఈ వీడియోని ఎస్ఏ20 అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌తో షేర్ చేశారు.

ఈ క్యాచ్‌ని పట్టుకోవడానికి నీషమ్ లాంగ్ జంప్ తీసుకున్నట్లు ఈ వీడియోలో చూడవచ్చు. జాషువా లిటిల్ ఓవర్‌లో అతను ఈ క్యాచ్ పట్టాడు. లిటిల్ మొదటి ఇన్నింగ్స్‌లో 14వ, తన స్పెల్‌లో మూడో ఓవర్‌ని బౌలింగ్ చేస్తున్నాడు. ఈ ఓవర్‌లో అదే చివరి బంతి. ఈ ఓవర్‌లో లిటిల్ ఇప్పటికే చాలా ఖరీదైనదిగా నిరూపించుకున్నాడు. అతను తన చివరి ఐదు బంతుల్లో 19 పరుగులు ఇచ్చాడు. చివరి బంతిని క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్ వియాన్ మల్డర్‌ ఆడాడు. ముల్డర్ ఈ బంతిని ఆఫ్ సైడ్ వైపు ఆడాలనుకున్నాడు. అయితే అక్కడ ఫీల్డింగ్‌లో ఉన్న జిమ్మీ నీషమ్ బంతిని గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు.

ఇవి కూడా చదవండి

ఈ షేర్ చేసిన వీడియోలో, నీషమ్ మొదట ఈ క్యాచ్ కోసం దూకి, ఆపై దానిని ఒంటి చేత్తో పట్టుకున్నట్లు చూడొచ్చు. క్యాచ్ తీసుకున్న తర్వాత అతను నేలపై పడిపోయాడు. దీంతో వియాన్ ముల్డర్ ఇన్నింగ్స్ 9 పరుగుల వద్ద ముగిసింది.

డర్బన్ సూపర్ జెయింట్స్ భారీ విజయం..

ఈ మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్ 151 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన క్వింటన్ డి కాక్ నేతృత్వంలోని డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఇందులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ 44 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేశాడు. పరుగుల ఛేదనలో ప్రిటోరియా క్యాపిటల్స్ 13.5 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..