మహిళల ప్రీమియర్ లీగ్ సందడిగా సాగుతోంది. రెండు రోజుల్లో మూడు మ్యాచ్‌లు జరిగాయి. అయితే ఈ మ్యాచ్‌ల్లో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అలాంటి వాటిలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన జెమీమా రోడ్రిగ్స్ వీడియోలు అగ్రస్థానంలో నిలిచాయి. ఢిల్లీ, బెంగళూర్ మధ్య మ్యాచ్ సందర్భంగా, జెమీమా అకస్మాత్తుగా బౌండరీ లైన్‌లో చేసిన సందడి మాములుగా లేదు. ఈ వీడియోల్లో విభిన్న స్టెప్పులతో అభిమానులకు మాంచి ఎంటర్టైన్‌మెంట్ అందించింది. అభిమానులు ఆమె డ్యాన్స్‌లను ఫోన్స్‌ల్లో బంధించి, సోషల్ మీడియాలో షేర్ చేవారు. వీటిని జెమీమా స్వయంగా రీట్వీట్ చేసింది.
5 మార్చి 2023 మొదటి WPL మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 60 పరుగులతో గెలిచింది. ఢిల్లీ విజయానికి దగ్గరగా ఉన్నప్పుడు, జెమీమా రోడ్రిగ్స్ బౌండరీ లైన్‌పై నిలబడి కొన్ని డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకుంది.
@JemiRodrigues If anyone dint believe me…?? #WPL2023 #RCBvsDC pic.twitter.com/lNeeAZ1ENc
— Ambika Kusum (@ambika_acharya) March 5, 2023
కొన్ని రోజుల క్రితం, జెమీమా ఆయుష్మాన్ ఖురానా సోదరుడు అపర్శక్తి ఖురానాతో కలిసి ఒక పాటను రికార్డ్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరిన తర్వాత కూడా సహచరుల ముందు గిటార్ వాయిస్తూ పాడుతూ అలరించింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు జెమీమా తనకు బ్యాటింగ్ చేయడమే కాకుండా డ్యాన్స్ చేయడం, పాడడం, గిటార్ వాయించడంలోనూ సత్తా ఉందని నిరూపించుకుంది.
@JemiRodrigues Here she goes again…? #WPL2023 #RCBvsDC @wplt20 @IPL pic.twitter.com/c9vmxXvJv0
— Ambika Kusum (@ambika_acharya) March 5, 2023
ఢిల్లీ-బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేయగా, ఆర్సీబీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించలేక.. 163 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఢిల్లీ జట్టు 60 పరుగుల తేడాతో విజయం సాధించింది.
@JemiRodrigues Do u think that was it??? Nah, the girls on a roll my dear ??? pic.twitter.com/YF11fdWOGq
— Ambika Kusum (@ambika_acharya) March 5, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..