రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ చరిత్ర సృష్టించాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఉనద్కత్ తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. అంతటితో ఆగకుండా తన రెండో ఓవర్ లో మరో 2 వికెట్లు తీశాడు. అలా మొత్తం 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా రంజీ ట్రోఫీ చరిత్రలో తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్ తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. సౌరాష్ట్ర, ఢిల్లీ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ యశ్ దుల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని తొలి ఓవర్‌లోనే దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ మూడో బంతికి ధృవ్ షోరే (0), నాలుగో బంతికి వైభవ్ రావల్ (0), ఐదో బంతికి యశ్ దుల్ (0)లను ఉనాద్కట్ అవుట్ చేశాడు. ఆ తర్వాత తన రెండో ఓవర్ నాలుగో బంతికి జాంటీ సింధు (4) బౌల్డ్ చేశాడు. ఇక చివరి బంతికి లలిత్ యాదవ్ (0)ను ఎల్బీగా బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత లక్షయ్ తేరేజా (1), శివంక్ వశిష్ట్ (38), కుల్‌దీప్ యాదవ్ ( 0)లను కూడా ఔట్ చేశాడు. ఇలా మ్యాచ్ మొత్తం మీద 12 ఓవర్ల వేసిన ఈ టీమిండియా వెటరన్ బౌలర్ 29 పరుగులిచ్చి మొత్తం 8 వికెట్లు నేలకూల్చాడు.
ఉనాద్కత్ చెలరేగడంతో ఢిల్లీ 0 పరుగులకే 3 వికెట్లు, 4 పరుగులకే 4వ వికెట్లు, 10 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. అయితే ప్రన్షు విజయరన్ (15), హృతిక్ షోకిన్ (68 నాటౌట్), శివంక్ వశిష్ట్ (38) ఆదుకోవడంతో 133 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది ఢిల్లీ. కాగా ఇటీవలే 12 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు ఉనాద్కత్. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఏకంగా 8 వికెట్లు పడగొట్టి మరోసారి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.
Jaydev Unadkat becomes first bowler to pick hat-trick in first over vs Delhi.
Captain KL Rahul Supremacy.? #LSG pic.twitter.com/gFbWOBrPYT
— Kunal Yadav (@kunaalyaadav) January 3, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..