IND vs ENG: ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్‌.. బుమ్రాతో పాటు మరో ప్లేయర్‌ కూడా ఔట్‌! ఎవరు? ఎందుకంటే..?

భారత్ ఇంగ్లాండ్ రెండవ టెస్టు మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ ఆడకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. బుమ్రా లేకపోతే, మహ్మద్ సిరాజ్ బౌలింగ్ ఎటాక్ ను నడిపించవచ్చు. అర్షదీప్ సింగ్ లేదా ఆకాశ్ దీప్ వారి స్థానంలో ఆడే అవకాశం ఉంది.

IND vs ENG: ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్‌.. బుమ్రాతో పాటు మరో ప్లేయర్‌ కూడా ఔట్‌! ఎవరు? ఎందుకంటే..?
Team India

Updated on: Jun 28, 2025 | 8:56 AM

భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య రెండో టెస్ట్‌ కోసం ఇరుదేశాల క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జూలై 2 నుంచి రెండో టెస్ట్‌ షురూ కానుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా.. ఇప్పటికే తొలి టెస్ట్‌ విజయంతో ఇంగ్లాండ్‌ జట్టు 0-1 ఆధిక్యంలో ఉంది. దీంతో ఎలాగైనా రెండో టెస్ట్‌ గెలిచి.. సిరీస్‌ను 1-1తో సమం చేసి.. మూడో టెస్ట్‌కు సిద్ధం అవ్వాలని యంగ్‌ టీమిండియా భావిస్తోంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ లాంటి సీనియర్ల రిటైర్మెంట్‌ తర్వాత టీమిండియా ఆడుతున్న సిరీస్‌ కావడంతో అందరి ఫోకస్‌ ఈ సిరీస్‌పై ఉంది.

కాగా, ఎంతో కీలకమైన రెండో టెస్టుకు టీమిండియా ప్రధాన బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా దూరం అయినట్లు వార్తలు వస్తున్నాయి. బుమ్రాతో పాటు మరో ప్లేయర్‌ కూడా రెండో టెస్ట్‌ ఆడకపోవచ్చని తాజా సమాచారం. ఆ ప్లేయర్‌ ఎవరంటే.. ప్రసిధ్‌ కృష్ణ. ఈ యంగ్‌ పేసర్‌ కూడా రెండో టెస్ట్‌కు దూరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తొలి టెస్లులో ఐదు వికెట్లు సాధించిన ప్రసిద్‌.. పరుగులు భారీగా సమర్పించుకున్నాడు. అతని ఎకానమీ 6 కంటే ఎక్కువగా ఉంది. అందుకే.. అతన్ని పక్కనపెట్టి అతని స్థానంలో అర్షదీప్‌ సింగ్‌ లేదా ఆకాశ్‌ దీప్‌ను రెండో టెస్ట్‌ కోసం ప్లేయింగ్‌ ఎలెవెన్‌లోకి తీసుకునే అవకాశం ఉంది.

బుమ్రాతో పాటు ప్రసిద్ కూడా ఆడకుంటే.. అర్షదీప్‌, ఆకాశ్‌ దీప్‌ ఇద్దరూ రెండో టెస్ట్‌ బరిలోకి దిగే ఛాన్స్‌. ఇక రెండో టెస్ట్‌ కోసం టీమిండియా నిర్వహిస్తున్న ప్రాక్టీస్‌ సెషన్స్‌ బుమ్రాతో పాటు ప్రసిద్‌ సైతం హాజరు కాలేదు. దీంతో అతను రెండో టెస్ట్‌ ఆడటం లేదనే విషయం కన్ఫామ్‌ చేసుకోవచ్చని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. బుమ్రా లేకపోతే.. టీమిండియా బౌలింగ్‌ ఎటాక్‌కు మొహమ్మద్‌ సిరాజ్‌ నాయకత్వం వహించనున్నారు. కానీ, తొలి టెస్ట్‌లో సిరాజ్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కానీ, అతని ఎకానమీ బాగుంది. అయితే సిరాజ్‌ ఒక్కసారి వికెట్లు తీయడం మొదలుపెడితే, పిచ్‌ అతనికి అనుకూలంగా ఉంటే.. అతన్ని ఆపడం ఇంగ్లాండ్‌ వల్ల కాదు. మ్యాచ్‌ను వన్‌సైడ్‌ చేసే బౌలర్‌ సిరాజ్‌.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి