ఐసీసీ వరల్డ్ కప్ 2019సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు సత్తా చాటారు. ఈ ప్రపంచ కప్‌లో అజేయంగా ముందుకెళ్తోన్న న్యూజిలాండ్ జట్టును 237/6కే పరిమితం చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌ను పాకిస్థాన్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ఐదు పరుగులు చేసిన మార్టిన్ గప్టిల్ అమీర్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో.. న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది.
స్పిన్నర్ల రంగ ప్రవేశంతో కివీస్ బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. షాహీన్ అఫ్రిదీ దెబ్బకు మున్రో (12), రాస్ టేలర్ (3), టామ్ లాథమ్ (1) వెనువెంటనే ఔటయ్యారు. దీంతో న్యూజిలాండ్ 12.3 ఓవర్లలో 46 పరుగులకే 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.
సూపర్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ కివీస్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 69 బంతుల్లో 41 పరుగులు చేసి హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న కేన్.. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో కివీస్ జట్టు 83 పరుగులకే ఐదు వికెట్లను చేజార్చుకుంది. దీంతో 1992 వరల్డ్ కప్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ను పాకిస్థాన్ గుర్తుకు తెచ్చింది.
ఈ దశలో గ్రాండ్ హోమ్ (64), జేమ్స్ నీషామ్ (97 నాటౌట్) న్యూజిలాండ్‌ను ఆదుకున్నారు. నీషామ్ కొద్దిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ.. అద్భుత పోరాటంతో కివీస్ పరువు కాపాడాడు. గ్రాండ్‌హోమ్, నీషామ్ ఆరో వికెట్‌కు 132 పరుగులు జోడించారు. గ్రాండ్‌హోమ్ రనౌటైనా.. నీషామ్ క్రీజులో పాతుకుపోయాడు. దీంతో కివీస్ జట్టు 238 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది.
46/4 ➡️ 237/6
New Zealand have done an excellent job to finish with a competitive score after their shaky start.
Will it be enough though?#CWC19 | #NZvBAN pic.twitter.com/XMdHHb0SPl
— Cricket World Cup (@cricketworldcup) June 26, 2019