మైండ్ దొబ్బింది మావ.! 13 ఫోర్లు, 3 సిక్సర్లతో RCB పిచ్చోడి రణభేరి.. జర్రున ఎక్కేసిందిగా

వన్డేలలో టాప్ 4 మళ్లీ సిద్దమవుతున్నారు. సీనియర్ల బాటలో బౌలర్ల ఊచకోతకు రంగం సిద్దమైంది. యువ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోతున్నారు. సరిగ్గా ఇదే కోవకు వస్తాడు ఇంగ్లాండ్ బ్యాటర్. మరి అతడెవరో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓసారి లుక్కేయండి

మైండ్ దొబ్బింది మావ.! 13 ఫోర్లు, 3 సిక్సర్లతో RCB పిచ్చోడి రణభేరి.. జర్రున ఎక్కేసిందిగా
Rcb Player

Updated on: Sep 08, 2025 | 5:57 PM

ఇంగ్లాండ్ బ్యాటర్ జాక్ బెథిల్ దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో సఫారీ బౌలర్లను ఊచకోత కోశాడు. అసలే మొదటి రెండు వన్డేలు జట్టు ఓడిపోయింది. పరువు నిలబడాలంటే.. మూడో వన్డే కచ్చితంగా గెలవాల్సిందే. ఇక ఆ వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌తో రచ్చలేపింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 414 పరుగులు చేసింది. ఈ భారీ స్కోర్‌లో జాకబ్ బెథిల్ కీలక పాత్ర పోషించాడు. మిడిలార్డర్‌లో వచ్చిన ఈ బ్యాటర్.. 82 బంతుల్లో 110 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇతడికి తోడు సీనియర్ బ్యాటర్ జో రూట్ సెంచరీతో కదంతొక్కాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 150కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

మనోడు కేవలం 15 వన్డేలు మాత్రమే ఆడాడు. ఈలోపే తన సత్తా ఏంటో వన్డే క్రికెట్‌కు చూపించాడు. 40 యావరేజ్‌తో 4 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ చేశాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన బెథిల్.. కోహ్లీ శిష్యరికంలో బ్యాటింగ్‌లో మెలుకువలు నేర్చుకున్నాడు. ఇదే ఫాం కంటిన్యూ చేస్తే బెథిల్‌ను వన్డే క్రికెట్‌లో ఆపడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.