టీ20 ప్రపంచ కప్‌లో ఇండియా ఓటమితో మొదలు పెట్టింది. ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన సూపర్ 12 గ్రూప్-2 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. భారత ఓటమిపై దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించారు. ఇది భారత జట్టుకు “హెచ్చరిక” అని పేర్కొన్నాడు. ఇండియా టీం ముందుకు సాగడం చాలా ముఖ్యం అని చెప్పాడు. ఆటగాళ్లు త్వరగా తమను తాము తెలుసుకుని పాకిస్తాన్ మ్యాచ్‌లో ఏం జరిగిందో మరిచిపోయి తదుపరి మ్యాచులపై దృష్టి పెట్టండని గవాస్కర్ సూచించారు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన “మెన్ ఇన్ బ్లూ” కు ప్రారంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పేసర్ షహీన్ షా అఫ్రిది రోహిత్ శర్మ (గోల్డెన్ డక్), KL రాహుల్ (3)ను వెంటవెంట ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చాడు. ప్రమాదకరంగా కనిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్‌ను ఆరో ఓవర్‌లో హసన్ అలీ ఔట్ చేశాడు. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ నాలుగో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో 39 పరుగులు చేసిన పంత్ ఔటయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్ కోహ్లీ తన 29వ టీ 20 హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో టీం ఇండియా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. 52 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా పాకిస్థాన్ ఛేదించింది.
Read Also.. Ind Vs Pak: కెప్టెన్‌గా హుందాతనాన్ని ప్రదర్శించిన విరాట్ కోహ్లీ.. రిజ్వాన్‌ను కౌగిలించుకుని అభినందనలు..