Ravichandran Ashwin: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్న అశ్విన్.. ఆ జాబితాలో ఈ ఆఫ్ స్పిన్నర్ చేరుతాడా..?
Ravichandran Ashwin Going Set A New Record: ఇంగ్లాండ్‌తో భారత్ ఆడుతోన్న నాలుగు టెస్టుల మ్యాచ్‌లో భాగంగా ఇండియన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మంచి ప్రతిభను కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన రెండు..
Ravichandran Ashwin Going Set A New Record: ఇంగ్లాండ్‌తో భారత్ ఆడుతోన్న నాలుగు టెస్టుల మ్యాచ్‌లో భాగంగా ఇండియన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మంచి ప్రతిభను కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో కలిపి అశ్విన్ 17.82 సగటుతో 17 వికెట్లు పడగొట్టి రెండో టెస్ట్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇందులో అశ్విన్ ఏకంగా రెండుసార్లు 5 వెకెట్లు తీసుకొని రికార్డు సృష్టించాడు. ఇదిలా ఉంటే రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. 400 వికెట్లు పడగొట్టిన నాలుగో భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కేందుకు అశ్విన్ మరో 6 వికెట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. దీంతో భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో బుధవారం నుంచి ప్రారంభంకానున్న మూడో మ్యాచ్‌లో అశ్విన్ ఆ రికార్డును తిరగరాస్తాడా లేదా వేచి చూడాలి. ఇక అశ్విన్ కెరీర్ విషయానికొస్తే.. 2011లో టెస్టు మ్యాచ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్ ఇప్పటి 76 టెస్టు మ్యాచుల్లో 394 వికెట్లు తీసుకున్నాడు.