IPL 2022: ప్రపంచంలోనే ఇప్పటివరకు ఏ బ్యాట్స్‌మెన్ చేయని రికార్డ్.. కోహ్లీ ఖాతాలో చేరిన అరుదైన ఘనత.. అదేంటంటే?

2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోహ్లీకి అనుబంధం ఉంది. ఐపీఎల్ 15 సీజన్‌లతో పాటు ఛాంపియన్స్ లీగ్‌లో బెంగళూరు తరపున ఆడాడు.

IPL 2022: ప్రపంచంలోనే  ఇప్పటివరకు ఏ బ్యాట్స్‌మెన్ చేయని రికార్డ్.. కోహ్లీ ఖాతాలో చేరిన అరుదైన ఘనత.. అదేంటంటే?
Virat Kohli

Updated on: May 20, 2022 | 6:54 AM

ఈ సీజన్‌లో భారత, ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్ చాలా వరకు మౌనంగానే ఉంది. అయితే గురువారం గుజరాత్ టైటాన్స్‌పై తుఫాను హాఫ్ సెంచరీతో దుమ్మురేపి, తన పేరిట ఓ భారీ రికార్డును నమోదు చేసుకున్నాడు. కోహ్లీ ఫామ్‌లోకి రావడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 54 బంతుల్లో మొత్తం 73 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు. 135 కంటే ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో కోహ్లీ సిక్సర్‌తో 45వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ 54 పరుగులు చేసిన వెంటనే భారీ రికార్డు అతని పేరులో వచ్చి చేరింది. టీ20 క్రికెట్‌లో ఫ్రాంచైజీ తరపున 7000 పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున విరాట్ కోహ్లి టీ20 క్రికెట్‌లో 7 వేల పరుగుల సంఖ్యను చేరుకున్నాడు.

2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోహ్లీకి అనుబంధం ఉంది. ఐపీఎల్ 15 సీజన్‌లతో పాటు ఛాంపియన్స్ లీగ్‌లో బెంగళూరు తరపున ఆడాడు. ఈ కారణంగా, అతను 7 వేలకు పైగా పరుగులు సాధించాడు. కోహ్లితో పాటు బెంగుళూరు తరపున ఏబీ డివిలియర్స్ 4522 పరుగులు చేయగా, క్రిస్ గేల్ 3420 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఇన్నింగ్స్‌తో RCB 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో కోహ్లీ ప్లేఆఫ్‌కు వెళ్లాలనే ఆశను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం ఢిల్లీ ఓడిపోతే ప్లేఆఫ్‌కు వెళ్లేందుకు ఛాన్స్ ఉంది.

Also Read: RCB vs GT IPL Match Result: గుజరాత్ ను చిత్తు చేసిన ఆర్సీబీ.. ఎనిమిది వికెట్ల తేడాతో విజయం

RR vs CSK Prediction Playing XI IPL 2022: చెన్నై చివరి మ్యాచ్‌లోనైనా గెలిచేనా.. జోరుమీదున్న రాజస్థాన్‌ రాయల్స్‌..!