
Mumbai Indians vs Sunrisers Hyderabad: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాపార్డర్ బ్యాటర్లు పూర్తిగా నిరాశ పర్చారు. ముంబయి ఇండియన్స్ తో వాంఖడే మైదానం వేదికగా జరుగుతోన్న మ్యాచ్ లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (48) టాప్ మినహా మరెవరూ పెద్దగా పరుగులు చేయలేదు. అయితే ఆఖరులో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ( 17 బంతుల్లో 35, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో ఎస్ ఆర్ హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (11), నితీశ్‌రెడ్డి (20), జాన్సేన్ (17), షాబాజ్ (10)మయాంక్ అగర్వాల్ (5), హెన్రిచ్ క్లాసెన్ (2) ఇలా టాప్, మిడిలార్డర్ బ్యాటర్లందరూ విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా, హార్దిక్ పాండ్యా చెరో 3 వికెట్లు పడగొట్టారు. కంబోజ్, బుమ్రా తలో వికెట్ తీశారు. ప్లేఆఫ్ పరంగా ఈ మ్యాచ్ హైదరాబాద్‌కు కీలకం. మరి ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలుస్తుందా లేక ముంబై తమ చివరి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా? అన్నది ఆసక్తికరం.
హైదరాబాద్ తరఫున ఓపెనర్ ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 48 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 11 పరుగులు చేశాడు. మయాంక్ అగర్వాల్ 5 పరుగుల వద్ద ఔటయ్యాడు. నితీష్ రెడ్డి 20 పరుగులు చేసి వెనుదిరిగాడు. పియూష్ చావ్లా హెన్రిక్ క్లాసెన్‌ను 2 పరుగుల వద్ద అవుట్ చేశాడు. మార్కో జాన్సెన్ 17 పరుగుల వద్ద ఔటయ్యాడు.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార
నేహాల్ వధేరా, షామ్స్ ములానీ, శివాలిక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, రొమారియో షెపర్డ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, T నటరాజన్
యాంక్ మార్కండే, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, జయదేవ్ ఉనద్కత్, ఉమ్రాన్ మాలిక్,
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..