IPL 2022: 139 కి.మీ. స్పీడ్‌తో బుల్లెట్ లాంటి యార్కర్‌.. దెబ్బకు వికెట్లతో సహా స్టార్‌ ఆటగాడు ఎలా కింద పడిపోయారో మీరే చూడండి..

| Edited By: Anil kumar poka

Apr 22, 2022 | 9:20 AM

MI vs CSK, IPL 2022: ఐపీఎల్‌- 2022లో భాగంగా గురువారం (ఏప్రిల్‌ 21) రాత్రి ముంబై ఇండియన్స్‌ (MI), చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.

IPL 2022: 139 కి.మీ. స్పీడ్‌తో బుల్లెట్ లాంటి యార్కర్‌.. దెబ్బకు వికెట్లతో సహా స్టార్‌ ఆటగాడు ఎలా కింద పడిపోయారో మీరే చూడండి..
Ipl 2022
Follow us on

MI vs CSK, IPL 2022: ఐపీఎల్‌- 2022లో భాగంగా గురువారం (ఏప్రిల్‌ 21) రాత్రి ముంబై ఇండియన్స్‌ (MI), చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే ధనాధన్‌ ధోని ఇన్నింగ్స్ తో చెన్నై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై విధించిన 156 పరుగుల లక్ష్యాన్ని చెన్నై చివరి బంతికి ఛేదించింది. కాగా చెన్నై విజయంతో ధోనితో పాటు మరొకరు కూడా కీలక పాత్ర పోషించారు. అతనే లెఫ్టార్మ్‌ సీమర్‌ ముఖేష్‌ చౌదరి (Mukesh Choudhary). ముందుగా బ్యాటింగ్‌ చేసిన ముంబైను మూడు చెరువుల నీళ్లు తాగించాడు ఈ ఫాస్ట్ బౌలర్‌. మూడు కీలక వికెట్లు (19/3) తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం అందుకున్నాడు.

కాగా పిచ్‌పై లభిస్తోన్న బౌన్స్‌ను ఉపయోగించుకుంటూ ఇన్నింగ్స్‌ రెండో బంతికే హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మను పెవిలియన్‌కు పంపించాడు ముఖేష్‌. ఆతర్వాత బాధితుడు ఇషాన్‌ కిషన్‌. 139కిలోమీటర్ల స్పీడుతో చౌదరి విసిరిన యార్కర్‌కు ఇషాన్‌ వద్ద అసలు సమాధానం లేకపోయింది. బంతిని ఎదుర్కోలేక పూర్తిగా నేలమీద పడిపోయాడు కిషన్‌. వెనుక వికెట్లు కూడా ఎగిరిపోయాయి. దీంతో గోల్డెన్‌ డక్‌గా ఔటై నిరాశగా క్రీజును వీడాడు కిషన్‌. కాగా దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా ఈ సీజన్‌లో ముఖేష్‌నురూ. 20 లక్షల బేస్ ప్రైస్‌తో కొనుగోలు చేసింది చెన్నై. గత మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపనప్పటికీ ముంబైతో మ్యాచ్‌లో మరో అవకాశం కల్పించింది. కెప్టెన్‌ నమ్మకాన్ని నిజం చేస్తూ రోహిత్, ఇషాన్, డెవాల్డ్ బ్రెవిస్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

Also Read:MI vs CSK IPL 2022: ధోని ధనా ధన్‌ ఇన్నింగ్స్‌.. థ్రిల్లింగ్‌ పోరులో చివరి బంతికి విజయం సాధించిన చెన్నై..

PM Modi Address Live Updates: గురుతేజ్ బహదూర్ 400వ ప్రకాష్ పర్వ్.. ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగం..

Arizona Wildfire: ఆరిజోనాను వణికిస్తున్న కార్చిచ్చు.. కార్చిచ్చుకు 25 ఇళ్ల, భవనాలు దగ్దం..