జోబర్గ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ రికార్డు పుస్తకాల్లో తన పేరును శాశ్వతంగా లిఖించుకున్నాడు. SA20 లీగ్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా ఫాఫ్ డు ప్లెసిస్ నిలిచాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ కేవలం 58 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయంగా 113 పరుగులు చేశాడు. మంగళవారం డర్బన్ సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డు ప్లెసిస్ అద్భుత ప్రదర్శన చేశాడు. వాండరర్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హెన్రీస్ క్లాసెన్ (65) అద్భుత ఇన్నింగ్స్‌తో డర్బన్ సూపర్‌జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. జబర్గ్ సూపర్ కింగ్స్ 5 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
179 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, రీజా హెండ్రిక్స్ (45) శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 157 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రీజా హెండ్రిక్స్ కీలక పాత్రను పోషించి, ఫాఫ్ డు ప్లెసిస్‌కు స్వేచ్ఛగా ఆడే అవకాశాన్ని ఇచ్చింది. హెండ్రిక్స్ 46 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. మల్డర్ క్యాచ్ అవుట్ చేయడం ద్వారా రీస్ టాప్లీ ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. ఆ తర్వాత డొనోవన్ ఫెరీరా (4) వికెట్ కీపర్ డి కాక్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.
The maiden #Betway #SA20 CENTURY has been an absolute delight to witness! Faf du Plessis is a man for the big moments ?#JSKvDSG | @Betway_India pic.twitter.com/QcZAAYOLU6
— Betway SA20 (@SA20_League) January 24, 2023
దీంతో ఫాఫ్ డు ప్లెసిస్ ఆఖరి ఓవర్ తొలి బంతికే లూయిస్ డు ప్లూ (6*)తో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఏడు మ్యాచ్‌ల్లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు ఇది నాలుగో విజయం. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. మరోవైపు డర్బన్ సూపర్‌జెయింట్స్ ఏడు మ్యాచ్‌ల్లో ఐదవ ఓటమిని చవిచూసింది. ఆరు జట్ల పోటీలో చివరి స్థానంలో నిలిచింది. ప్రిటోరియా క్యాపిటల్స్ ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..