IPL 2022 points table: ప్లే ఆఫ్‌ రేసులో కోల్‌కతా.. ముంబైపై విజయంతో పాయింట్ల పట్టికలో మార్పులు..!

IPL 2022 points table: డివై పాటిల్ స్టేడియంలో సోమవారం జరిగిన 'డూ ఆర్ డై' మ్యాచ్‌లో కోల్‌కతా 52 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ప్లేఆఫ్‌ రేసులో నిలిచింది.

IPL 2022 points table: ప్లే ఆఫ్‌ రేసులో కోల్‌కతా.. ముంబైపై విజయంతో పాయింట్ల పట్టికలో మార్పులు..!
Kkr Play Off Race

Updated on: May 10, 2022 | 7:00 AM

IPL 2022 points table: డివై పాటిల్ స్టేడియంలో సోమవారం జరిగిన ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో కోల్‌కతా 52 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ప్లేఆఫ్‌ రేసులో నిలిచింది. జట్టు ఇప్పుడు పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి చేరుకుంది. KKR అభిమానులకు మరికొన్ని రోజులు కలలు కనే అవకాశం కల్పించింది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ విజయం తర్వాత కోల్‌కతా పాయింట్ల పట్టికలో కిందికి పడిపోయింది. దీంతో చివరి 3 మ్యాచ్‌లు కీలకంగా మారాయి. ఇందులో ముంబైతో జరిగిన మొదటి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇంకా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాల్సి ఉంది.

కోల్‌కతా తరఫున మరోసారి ప్యాట్ కమిన్స్ ముంబైపై చెలరేగాడు. ఒకే ఓవర్‌లో 3 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. 18వ ఓవర్‌లోనే విజయం సాధించడంతో కోల్‌కతా 12 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు సాధించింది. నెట్‌ రన్‌రేట్‌ కూడా కొంచెం మెరుగైంది. కోల్‌కతా ఇప్పుడు పంజాబ్‌తో సమానంగా 10 పాయింట్లను కలిగి ఉంది. మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ కారణంగా ముందుంది. పంజాబ్ ఇప్పుడు ఎనిమిదో స్థానానికి, చెన్నై తిరిగి తొమ్మిదో స్థానానికి చేరుకోగా, ముంబై 11 మ్యాచ్‌ల్లో కేవలం 4 పాయింట్లతో చివరిగా ఉంది. KKR ఇప్పుడు తన మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలవాలి. అందులో నెక్స్ట్‌ మ్యాచ్‌ మే 14న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతుంది. మే 18న లక్నో సూపర్ జెయింట్‌తో చివరి మ్యాచ్ ఉంటుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే 14 పాయింట్లు సాధిస్తుంది. కానీ ప్లే ఆఫ్‌ రేసులో ఉండాలంటే నెట్‌ రన్‌ రేట్‌ మెరుగ్గా ఉండాలి.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

MI vs KKR: కోల్‌కతా సూపర్ విక్టరీ.. 113 పరుగులకే కుప్పకూలిన ముంబై..

Vitamin D: మహిళల్లో ఈ 4 లక్షణాలు ఉంటే అది విటమిన్‌ డి లోపం..!

Viral Video: ఈ మహిళా వెయిటర్‌ సూపర్.. బీర్‌ బాటిల్‌ మూత ఎలా తీసిందో చూస్తే షాక్‌..!