ఢిల్లీలో దంచితే, దుబాయ్‌లో రియాక్షన్.. 30 లక్షలతో వచ్చి, 3.8 కోట్లు పట్టుకెళ్లాడు.. అసలెవరీ ప్రియాంష్ ఆర్య?

|

Nov 25, 2024 | 7:57 PM

IPL 2025 Auction, Priyansh Arya: ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రియాంష్ ఆర్య (120) ఓ ఓవర్‌లో ఆరు సిక్సులను బాదేశాడు. దీంతో సోసల్ మీడియాతోపాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలను ఆకర్షించాడు. దీంతో ఐపీఎల్ వేలంలో భారీ ధరను సొంతం చేసుకున్నాడు.

ఢిల్లీలో దంచితే, దుబాయ్‌లో రియాక్షన్.. 30 లక్షలతో వచ్చి, 3.8 కోట్లు పట్టుకెళ్లాడు.. అసలెవరీ ప్రియాంష్ ఆర్య?
Priyansh Arya
Follow us on

IPL 2025 Auction, Priyansh Arya: ప్రియాంష్ ఆర్యను పంజాబ్ కింగ్స్ 3.8 కోట్లకు సొంతం చేసుకుంది. అతని బేస్ ధర రూ.30 లక్షలే కావడం విశేషం. దీంతో అసలు ఎవరీ ప్లేయర్ అంటూ అంతా ఆసక్తి చూపిస్తున్నారు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రియాంష్ ఆర్య (120) ఒక ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టాడు. దీంతో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ ఐదు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. భారత్ అండర్-19 తరపున ఆడిన ఆర్య, సౌత్ ఢిల్లీ ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదడంతో వెలుగులోకి వచ్చాడు.

ఈ ఎడమచేతి వాటం ఆటగాడు ఆర్య 10 సిక్సర్లు, 10 ఫోర్లతో 50 బంతుల్లో 120 పరుగులు చేశాడు. అదే సమయంలో 40 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేశాడు. మనన్ భరద్వాజ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ 12వ ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్‌లు బాదేశాడు.

2023-24 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆర్య ఏడు ఇన్నింగ్స్‌లలో 31.71 సగటు, 166.91 స్ట్రైక్ రేట్‌తో 222 పరుగులు చేసి ఢిల్లీ టాప్ రన్-స్కోరర్‌గా నిలిచాడు. అతను IPL 2024 వేలం కోసం షార్ట్‌లిస్ట్ చేసినప్పటికీ, ఆ సమయంలో ఆర్య అమ్ముడుపోలేదు. అయితే, రాబోయే సీజన్‌లో పంజాబ్ కింగ్స్ అతని సేవలను పొందనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి