IPL Media Rights: 4 భాగాలుగా హక్కుల వేలం.. రేటు ఎంతైనా తగ్గేదేలే.. పోటీలో చేరిన యాపిల్, నెట్‌ఫ్లిక్స్, ఫేస్‌బుక్?

|

Apr 06, 2022 | 3:20 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీడియా హక్కులను విక్రయించడం ద్వారా భారత క్రికెట్ బోర్డ్ (బీసీసీఐ) భారీగా సంపాదించనుంది. 2023 నుంచి 2027 వరకు, బోర్డు ఐదు సీజన్ల హక్కుల వేలం ద్వారా $ 7.2 బిలియన్ (సుమారు రూ. 54 వేల కోట్లు) సంపాదించే ఛాన్స్ ఉంది.

IPL Media Rights: 4 భాగాలుగా హక్కుల వేలం.. రేటు ఎంతైనా తగ్గేదేలే.. పోటీలో చేరిన యాపిల్, నెట్‌ఫ్లిక్స్, ఫేస్‌బుక్?
Ipl Media Rights
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మీడియా హక్కుల(Media Rights)ను విక్రయించడం ద్వారా భారత క్రికెట్ బోర్డ్ (BCCI) భారీగా సంపాదించనుంది. 2023 నుంచి 2027 వరకు, బోర్డు ఐదు సీజన్ల హక్కుల వేలం ద్వారా $ 7.2 బిలియన్ (సుమారు రూ. 54 వేల కోట్లు) సంపాదించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం టెండర్ పత్రాల విక్రయం జరుగుతోంది. ఇప్పటి వరకు టీవీ18 వయాకామ్, డిస్నీ, సోనీ, జీ, అమెజాన్, మరో కంపెనీ డాక్యుమెంట్లను కొనుగోలు చేశాయి. అమెరికా కంపెనీ యాపిల్ కూడా త్వరలో పత్రాలను కొనుగోలు చేయగలదని నమ్ముతున్నారు.

5 పాయింట్లలో మీడియా హక్కుల వేలం గురించి పూర్తిగా తెలుసుకుందాం..

1. మే 10 వరకు..

మే 10 వరకు పత్రాలు కొనుగోలు చేయవచ్చని బీసీసీఐ పేర్కొంది. మీడియా హక్కుల కోసం టెండర్ పత్రాలను మే 10 వరకు కొనుగోలు చేయవచ్చు. దీని తర్వాత సుమారు నెల రోజుల పాటు సమర్పించిన పత్రాలను పరిశీలించి జూన్ రెండో వారంలో వేలంపాటలో గెలిచి హక్కులు పొందిన కంపెనీల పేర్లను ప్రకటించనున్నారు.

2. నాలుగు భాగాలుగా టెండర్లు..

ఈసారి BCCI నాలుగు వేర్వేరు బంచ్‌ల రూపంలో మీడియా హక్కులను వేలం వేస్తోంది. మొదటి బంచ్‌లో భారత ఉపఖండంలో టీవీ హక్కులకు చెందినది. రెండవ బంచ్‌లో డిజిటల్ హక్కులు ఉండగా, మూడో బకెట్‌లో 18 మ్యాచ్‌లు చేర్చారు. ఈ 18 మ్యాచ్‌లలో సీజన్‌లోని మొదటి మ్యాచ్, ప్రతి వారాంతపు డబుల్-హెడర్‌తో సాయంత్రం మ్యాచ్, నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఇక నాల్గవ బకెట్‌లో భారత ఉపఖండం వెలుపల ప్రసార హక్కులుగా విభజించారు.

3. బేస్ ధర రూ. 32,890 కోట్లు..

నాలుగు బకెట్లతో కలిపి మొత్తం బేస్ ధర రూ. 32,890 కోట్లుగా బీసీసీఐ నిర్ణయించింది. ఒక్కో మ్యాచ్ టెలివిజన్ రైట్స్ బేస్ ధర రూ.49 కోట్లుగా నిర్ణయించారు. అదే సమయంలో, ఒక మ్యాచ్ డిజిటల్ హక్కుల బేస్ ధర రూ.33 కోట్లుగా పేర్కొంది. 18 మ్యాచ్‌ల క్లస్టర్‌లో ఒక్కో మ్యాచ్ బేస్ ధర రూ.16 కోట్లుగా నిర్ణయించింది. భారత ఉపఖండం వెలుపల హక్కుల కోసం ఒక్కో మ్యాచ్‌కు బేస్ ధర రూ. 3 కోట్లుగా పేర్కొంది. ఈ విధంగా మొత్తం రూ.32,890 బీసీసీఐ ఖజానాలోకి చేరనున్నాయి. అయితే, బడా కంపెనీలు పోటీపడనుండడంతో దాదాపు రూ.54 వేల కోట్లు వస్తాయని బోర్డు అంచనా వేస్తోంది.

4. రెండు రోజుల పాటు హక్కుల వేలం..

మొదటి, రెండవ బంచ్‌ల వేలం ఒక రోజు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. అదే సమయంలో, మూడవ, నాల్గవ బంచ్‌లను మరుసటి రోజు వేలం వేయనున్నట్లు పేర్కొంది. ఈ-వేలం ద్వారా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మొదటి బకెట్‌లో గెలుపొందిన కంపెనీ రెండో బకెట్‌కు మరోసారి వేలం వేయడానికి అనుమతించనున్నారు. అంటే, రెండో బకెట్‌ను వేరే కంపెనీ కొనుగోలు చేస్తే, మొదటి బకెట్‌ను కొనుగోలు చేసిన కంపెనీ అంతకంటే ఎక్కువ చెల్లించి పొందే ఛాన్స్ ఉంది. అదేవిధంగా, రెండవ బకెట్ విజేత కంపెనీ మూడవ బకెట్ కోసం మరోసారి వేలం వేయడానికి అనుమతి పొందనుంది.

5. కనీసం రూ.500ల కోట్లు..

భారత ఉపఖండం టీవీ హక్కులను భారతీయ కంపెనీ పొందనుంది. రెండవ, మూడవ, నాల్గవ బకెట్‌లకు బిడ్డర్ నికర విలువ కనీసం రూ. 500 కోట్లు ఉండాలని బీసీసీఐ పేర్కొంది.

Also Read: MI vs KKR Playing XI IPL 2022: ఇరుజట్లలో చేరనున్న కీలక ఆటగాళ్లు.. రికార్డుల్లో ముంబై, ఈ సీజన్‌లో కోల్‌కతాదే ఆధిపత్యం..

IPL 2022: కేఎల్ రాహుల్‌ భారీ రికార్డ్‌ను బ్రేక్ చేయనున్న ఆర్‌సీబీ సారథి.. కేవలం 5 అడుగుల దూరంలోనే..!