RCB vs DC IPL Match Result: మరో ఘోర ఓటమి.. ఆర్‌సీబీ అరంగేట్ర ప్లేయర్ దెబ్బకు ఢిల్లీ ఢమాల్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగగా, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది.

RCB vs DC IPL Match Result: మరో ఘోర ఓటమి.. ఆర్‌సీబీ అరంగేట్ర ప్లేయర్ దెబ్బకు ఢిల్లీ ఢమాల్..
Rcb Vs Dc Ipl 2023

Updated on: Apr 15, 2023 | 7:37 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగగా, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఐపీఎల్ 16వ సీజన్‌లో, ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టు పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగగా, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ తరపున తొలి మ్యాచ్‌ ఆడుతున్న విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ బంతితో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది వరుసగా 5వ ఓటమి.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ జట్టు తొలి 6 ఓవర్లలో 4 వికెట్లు డౌన్..

175 పరుగుల స్కోరును ఛేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ మ్యాచ్‌లో ఆరంభం చాలా దారుణంగా మారింది. ఖాతా తెరవకుండానే షా రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. జట్టు స్కోరు 1 పరుగు వద్ద పృథ్వీ షా వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మిచెల్ మార్ష్ రూపంలో మరో దెబ్బ తగిలింది. అతను వ్యక్తిగత స్కోరు సున్నా వద్ద వేన్ పర్నెల్‌కు బలి అయ్యాడు.

ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉండగా, ఢిల్లీ అట్టడుగు స్థానంలో నిలిచింది.

బెంగళూరు తరపున విరాట్ కోహ్లి (50 పరుగులు) అర్ధ సెంచరీ చేయగా, మహిపాల్ లోమ్రోర్ (26 పరుగులు), గ్లెన్ మాక్స్‌వెల్ (24 పరుగులు ) పరగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు.

175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి శుభారంభం లభించలేదు. ఆ జట్టు పవర్‌ప్లేలో 32 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయింది. అలాంటి స్థితిలో మిడిలార్డర్‌లో ఆడేందుకు వచ్చిన మనీష్ పాండే (50 పరుగులు) అర్ధసెంచరీతో పోరాడాడు. చివరకు హసరంగ చేతిలో ఎల్బీడబ్ల్యూగా పెవిలిన్ చేరాడు. అక్షర్ పటేల్ (21 పరుగులు) కూడా ఆకట్టుకోలేక పోయాడు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 19 పరుగులు చేశాడు.

బెంగళూరు తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన విజయ్‌కుమార్ వైశాక్ మూడు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ రెండు, పార్నెల్, హసరంగా, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..