IPL 2021, MI Vs PBKS Match Result: ఉత్కంఠ పోరులో గెలిచిన ముంబై.. తివారి, హార్ధిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్

|

Sep 28, 2021 | 11:31 PM

IPL 2021, MI Vs PBKS Match Result: చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో ముంబయి టీం 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విజయంలో సౌరభ్ తివారి(45), హార్ధిక్ పాండ్యా(40) కీలకంగా వ్యవహరించారు.

IPL 2021, MI Vs PBKS Match Result: ఉత్కంఠ పోరులో గెలిచిన ముంబై.. తివారి, హార్ధిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్
Ipl 2021 Mi Vs Pbks
Follow us on

IPL 2021, MI Vs PBKS Match Result: IPL 2021లో డబుల్ హెడర్ మ్యాచుల్లో భాగంగా నేడు రెండవ మ్యాచ్‌లో, ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (MI vs PBKS) తలపడ్డాయి. ఈ మ్యాచ్ అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో సీజన్ 42 వ మ్యాచ్‌గా జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో ముంబయి టీం 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విజయంలో సౌరభ్ తివారి(45), హార్ధిక్ పాండ్యా(40) కీలకంగా వ్యవహరించారు.

136 పరుగుల లక్ష్యంతో క్రీజులోకి వచ్చిన ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్ ఇద్దరూ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగానే ప్రారంభించారు. ఇక షాట్లు ఆడే సమయానికి రోహిత్(8) తొలి వికె‌ట్‌గా పెవిలియన్ చేరాడు. ఆవెంటనే సూర్యకుమార్(0) కూడా మరోసారి నిరాశ పరిచాడు. 2 వికెట్లు పడ్డ తరువాత ముంబయి బ్యాట్స్‌మెన్లు డికాక్, సౌరభ్ తివారి కీలకమైన 45 పరుగుల భాగసామ్యాన్ని అందించి మ్యాచ్‌పై ఆశలు నెలకొల్పారు. అయితే ఈ దశలో డికాక్(27 పరుగులు, 29 బంతులు, 2 ఫోర్లు) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. అయినా సరే తివారి మాత్రం వాలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగుల పెట్టించాడు. హాఫ్ సెంచరీ దిశగా సాగుతోన్న సౌరభ్ తివారి(45 పరుగులు, 37 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్సులు)ని ఎల్లీస్ బోల్తా కొట్టించాడు. ఆ తరువాత హార్దిక్ పాండ్యా(40 పరుగులు, 30 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు), పొలార్డ్ (15 పరుగులు, 7 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) మరోసారి ముంబైకు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం బౌలర్లలో బిష్ణోయ్ 2, షమీ, ఎల్లీస్ తలో వికెట్ తీశారు.

అంతకు ముందు కీలకమైన మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. దీంతో ముంబయి టీంపై 136 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచులో పంజాబ్ కింగ్స్ టీంకు మంచి ఆరంభం లభించలేదు. కేవలం టీం స్కోర్ 36 పరుగుల వద్ద ఓపెనర్ మన్‌దీప్ సింగ్ (15) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన క్రిస్‌గేల్(1) కూడా ఆకట్టుకోలేకపోయాడు. పొలార్డ్ బౌలింగ్‌లో హార్థిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇదే ఓవర్‌లో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (21) కూడా ఔటయ్యాడు. పూరన్ (2)కూడా నిరాశపరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దీపర్ హుడా(28 పరుగులు), మక్రాం (42పరుగులు, 29 బంతులు, 6 ఫోర్లు) అర్థ సెంచరీ భాగస్వామ్యం ఏర్పరిచి పంజాబ్ మంచి స్కోర్ సాధించేందుకు సహాయపడ్డారు.

హాఫ్ సెంచరీకి చేరువైన మక్రాంను బుమ్రా ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో పంజాబ్ భారీ సాధించే ఆశలు ఆవిరయ్యాయి. ముంబయి బౌలర్లలో బుమ్రా, పొలార్డ్ చెరో రెండు వికెట్లు, పాండ్యా, రాహుల్ చాహర్ చెరో వికెట్ పడగొట్టారు.

Also Read: Pakistan: డెంగ్యూతో బాధపడుతోన్న పాకిస్తాన్ ఆల్ రౌండర్.. జాతీయ టీ20 నుంచి నిష్క్రమణ

MI Vs PBKS, IPL 2021: విఫలమైన పంజాబ్ బ్యాట్స్‌మెన్స్.. ముంబయి టీం టార్గెట్ 136