
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ముగింపు దశలో మైదానంలో ఊహించని డ్రామా చోటుచేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అవుట్ విషయంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో తీవ్ర వాగ్వాదం జరిగింది. మైదానంలో అంపైర్లతో కోహ్లీ వాదించగా, ఆ తర్వాత థర్డ్ అంపైర్ నిర్ణయంపై గిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత పెరిగింది.
గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఈ రసవత్తర ఫైనల్ పోరులో 16వ ఓవర్ ఆఖరి బంతికి అసలు డ్రామా మొదలైంది. అర్షద్ ఖాన్ వేసిన బంతిని విరాట్ కోహ్లీ గాల్లోకి లేపాడు. మిడ్-ఆఫ్ దిశగా పరిగెత్తుకుంటూ వచ్చిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుకు డైవ్ చేస్తూ ఆ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. మైదానంలో ఉన్న అంపైర్లు వెంటనే దానిని అవుట్‌గా ప్రకటించారు. దీంతో గుజరాత్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోగా, కోహ్లీ నిరాశగా వెనుతిరగడం ప్రారంభించాడు.
అయితే, పెవిలియన్ వైపు కొద్ది దూరం నడిచిన కోహ్లీ, గిల్ పట్టిన క్యాచ్‌పై అనుమానంతో వెనక్కి తిరిగాడు. బంతి నేలకు తాకినట్లు భావించిన విరాట్, వెంటనే ఆన్-ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ వద్దకు వెళ్లి ఖచ్చితంగా టీవీ అంపైర్ ద్వారా పునఃపరిశీలించాలని డిమాండ్ చేశాడు. మొదట్లో అంపైర్ దీనిపై పెద్దగా ఆసక్తి చూపించనప్పటికీ, కోహ్లీ పట్టుబట్టడంతో ఉత్కంఠ రేగింది. మైదానంలో ఇరుపక్షాల మధ్య కాసేపు హీట్ వెదర్ కనిపించింది. కోహ్లీ తీవ్ర అసంతృప్తితో అంపైర్లను నిలదీయడంతో, చివరికి అంపైర్లు తుది నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు బదిలీ చేశారు.
టీవీ రీప్లేలో విభిన్న కోణాల నుంచి ఆ క్యాచ్‌ను చాలా నిమిషాల పాటు పరిశీలించారు. గిల్ వేళ్లు బంతి కింద ఉన్నాయా లేదా బంతి ముందే నేలకు తాకిందా అనే కోణంలో సుదీర్ఘమైన తనిఖీ జరిగింది. చివరకు బంతి భూమిని తాకినట్లు స్పష్టమవ్వడంతో థర్డ్ అంపైర్ స్క్రీన్‌పై ‘నాట్ అవుట్’ అని ప్రకటించారు. ఈ నిర్ణయంతో కోహ్లీ గాల్లోకి చేతులు ఊపుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేయగా, శుభ్‌మన్ గిల్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. తన వేళ్లు బంతి కిందనే ఉన్నాయని, అది క్లీన్ క్యాచ్ అని విరాట్ కోహ్లీతో గిల్ నేరుగా వాదనకు దిగాడు. ఇద్దరు అగ్రశ్రేణి భారత ఆటగాళ్లు మైదానంలో ఇలా వాదించుకోవడం అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది.
ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో ఇలాంటి హై-డ్రామా చోటుచేసుకోవడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అంపైర్ల నిర్ణయంపై గిల్ అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, ఆట నియమాల ప్రకారం కోహ్లీకి లభించిన ఈ పునరుజ్జీవనం మ్యాచ్ ఫలితాన్ని శాసించేలా మారింది. ఈ వివాదం సామాజిక మాధ్యమాల్లో సైతం వైరల్‌గా మారి అభిమానుల మధ్య పెద్ద యుద్ధానికే దారితీస్తోంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..