Watch Video: తొలి సీజన్‌లోనే అదరగొట్టిన గుజరాత్.. 14 ఏళ్లలో రెండోసారి ఇలా.. విన్నింగ్ మూమెంట్ చూశారా..

|

May 30, 2022 | 12:46 AM

ఇప్పటి వరకు ఐపీఎల్‌ సీజన్లలో టైటిల్‌ గెలిచిన 7వ జట్టుగా గుజరాత్‌ టైటాన్స్‌ గుర్తింపు పొందింది. అలాగే ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్ జట్టు టైటిల్ గెలిచుకుంది.

Watch Video: తొలి సీజన్‌లోనే అదరగొట్టిన గుజరాత్.. 14 ఏళ్లలో రెండోసారి ఇలా.. విన్నింగ్ మూమెంట్ చూశారా..
Gujarat Titans Winning Moment
Follow us on

IPL 2022 Final: అనుకున్నదే జరిగింది. ఎంతో ఆసక్తిరేపిన ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టీం విజేతగా నిలిచింది. ఐపీఎల్‌ తొలి సీజన్‌లోనే టైటిల్‌ గెలిచి హార్దిక్ సేన చరిత్ర సృష్టించింది. ఆదివారం ఆహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టీం రాజస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది. 131 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

14 ఏళ్లలో రెండోసారి..

ఇవి కూడా చదవండి

ఇప్పటి వరకు ఐపీఎల్‌ సీజన్లలో టైటిల్‌ గెలిచిన 7వ జట్టుగా గుజరాత్‌ టైటాన్స్‌ గుర్తింపు పొందింది. అలాగే ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్ జట్టు టైటిల్ గెలిచుకుంది. కాగా, 14 ఏళ్లలో ఇలా తొలి సీజన్‌లోనే ఓ జట్టు ట్రోఫీ గెలవడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకు ముందు 2008లో రాజస్థాన్ రాయల్స్ ఈ ఘనత సాధించింది.

రెండు జట్ల XI ప్లేయింగ్ –

రాజస్థాన్ రాయల్స్ – యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్ & కీపర్), దేవదత్ పెడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెడ్ మెక్‌కాయ్, యుజ్వేంద్ర చాహల్

గుజరాత్ టైటాన్స్ – వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఆర్. సాయి కిషోర్, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ.