
దేశవిదేశాల్లో ఎన్ని టీ20 టోర్నీలు పుట్టుకొచ్చినా.. కొందరు ఆటగాళ్లు తమ దేశానికి ప్రాతినిధ్యం వహించడానికే మొగ్గు చూపుతారు. ఆ కోవకు చెందిన ప్లేయరే ఈ ఆటగాడు. తమ దేశ టోర్నీలలో ఆడేందుకు మొగ్గు చూపి.. సిక్సర్ల వర్షంతో దుమ్ముదులిపాడు. ఐపీఎల్ కాంట్రాక్ట్ వచ్చినా కూడా దాన్ని వద్దు పొమ్మన్నాడు. కట్ చేస్తే.. దేశంలోని డొమెస్టిక్ టోర్నీలలో జోరు చూపించాడు. మరి ఆ ప్లేయర్ మరెవరో కాదు జాసన్ రాయ్.
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న ది హండ్రెడ్ టోర్నమెంట్ లో ఇంగ్లీష్ జట్టు మాజీ ఓపెనర్ జాసన్ రాయ్.. తన బ్యాట్ తో జోరు చూపించాడు. పరుగుల వరద పారిస్తూ.. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న జట్టుకు విజయాలు అందించాడు. ఈ టోర్నమెంట్ లీగ్ స్టేజిలోని ఆఖరి మ్యాచ్ లో సథరన్ బ్రేవ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సథరన్ బ్రేవ్.. 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇందులో జాసన్ రాయ్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. అతడితో పాటు ప్లూయ్ 21 బంతుల్లో 30 పరుగులు చేసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన వెల్ష్ ఫైర్ జట్టు 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాడ్ మోర్ ఒక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు. 46 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. అలాగే కేల్లవాయ్ 3 ఫోర్లతో 33 పరుగులు చేశాడు.