IPL auction: ఆ ఏడుగురు ప్లేయర్లు.. అమ్ముడుపోవడం డౌటే..

|

Nov 15, 2024 | 8:14 PM

రాబోయే ఐపీఎల్ 2025 వేలం నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డాలో జరగనుంది, పది ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ రిటైన్ చేసిన జాబితాను ప్రకటించాయి. స్టీవ్ స్మిత్, జో రూట్ వంటి స్టార్ ఆటగాళ్లు గత వేలంలో అమ్ముడుపోకపోయిన సంగతి తెలిసిందే. ఈ సారి ప్రాంచైజీలు ప్రతిభావంతులైన ఆటగాళ్లను దక్కించుకోవడానికి ఆసక్తి చూపించనున్నాయి. కొందరు ఆటగాళ్లలో ప్రతిభ ఉన్నప్పటికి ప్రాంచైజీలు వారిని తీసుకోకపోవచ్చు.

IPL auction: ఆ ఏడుగురు ప్లేయర్లు.. అమ్ముడుపోవడం డౌటే..
Ipl Auction
Follow us on

రాబోయే IPL 2025 సీజన్ కోసం, రెండు రోజుల పాటు నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డాలో జరగనున్న వేలం క్రికెట్ ప్రేమికులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పది ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాలను ప్రకటించగా, వేలంలో ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్లను దక్కించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. స్టీవ్ స్మిత్, జో రూట్ వంటి స్టార్ ఆటగాళ్లు గత వేలంలో అమ్ముడుపోకుండా ఉన్నారు. అయితే వేలంలో కొందరు ఆటగాళ్లను దక్కించుకోవడనాకి ఏ ప్రాంచైజీ ఆసక్తి చూపేపరిస్థితి లేని కొంతమంది ఆటగాళ్ల ఆ జాబితా ఓ సారి పరిశీలిస్తే..

ఏడుగురు ఆటగాళ్ల జాబితా

  1. జేమ్స్ ఆండర్సన్

ఒకప్పుడు టెస్ట్ క్రికెట్ లెజెండ్‌గా పేరు గడించిన ఆండర్సన్, ఆశ్చర్యకరంగా 42 ఏళ్ల వయసులో T20 వేలంలో ప్రవేశించారు. 2014 తరువాత T20 క్రికెట్ ఆడని ఆయన ₹1.25 కోట్ల బేస్ ధరతో తన పేరు న‌మోదు చేసుకున్నారు. ఐతే, ఐపీఎల్ డైనమిక్స్‌తో సరిపోలనిచ్చే శక్తి, వేగం లేని ఈ వయో వృద్ధ బౌలర్‌పై భవిష్యత్తులో జట్టు పెట్టుబడి పెట్టడం డౌటే.

 

  1. క్రిస్ లిన్

క్రిస్ లిన్ నిలకడౌన బ్యాటింగ్ ప్రదర్శనతో ఒకప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆకర్షణగా నిలిచాడు. కానీ, BBLలో అతని  ప్రదర్శనతో క్రిస్ లిన్ మార్కెట్ విలువ తగ్గిపోయింది. టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా ఉండి, కనీసం KKRతో గత అ విజయాలను పునరావృతం చేసే అవకాశం లేదు.

 

  1. తబ్రైజ్ షమ్సీ

ఒకప్పుడు నంబర్ 1 ICC T20 బౌలర్‌గా నిలిచిన షమ్సీ, ఇటీవల T20 క్రికెట్‌లో సాధారణ ప్రదర్శనతో తన స్థానాన్ని కోల్పోయాడు. విదేశీ స్పిన్నర్‌లకు ఉన్న పోటీయే కాకుండా జట్లకు భారతీయ స్పిన్నర్‌లపై ఆధారపడే ధోరణి కూడా షమ్సీ విజయావకాశాలను మరింత తగ్గించాయి.

 

  1. ఇష్ సోధి

న్యూజిలాండ్ T20 జట్టులో ప్రధాన సభ్యుడైన సోధి, IPLలో ఎప్పుడూ తన పూర్తి సామర్థ్యాన్ని చూపించలేకపోయాడు. ఫ్రాంచైజీలు యువ స్పిన్నర్‌లపై దృష్టి సారించడంతో, సోధికి అవకాశం దక్కే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

 

  1. అకేల్ హోసేన్

వెస్టిండీస్ T20 జట్టులో ప్రధానంగా నిలిచిన అకేల్, తన తెలివైన బౌలింగ్‌తో గుర్తింపు పొందాడు. కానీ, ₹1.50 కోట్ల బేస్ ధరతో, IPL ఫ్రాంచైజీలు అతనిపై పర్స్ ఖర్చు చేయాలా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది.

 

  1. రీజా హెండ్రిక్స్

దక్షిణాఫ్రికా బ్యాటర్, తన వయసుతో పాటూ IPL అనుభవం లేకపోవడం వల్ల మార్కెట్‌లో ప్రత్యేకంగా నిలబడలేకపోయాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్‌లతో విపరీతమైన పోటీ అతని అవకాశాలను తగ్గిస్తోంది.

 

  1. ఇషాంత్ శర్మ

గత సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ వయసు, గాయాల రిత్యా ఇషాంత్‌పై పెట్టుబడి పెట్టే అవకాశాలను తగ్గించాయి. ఫ్రాంచైజీలు యువ ఫాస్ట్ బౌలర్‌లకు ప్రాధాన్యత ఇస్తుండటంతో, ఇషాంత్ విక్రయించబడకపోవచ్చు.

ఈ ఆటగాళ్లు తమ రికార్డులతో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, IPL వేలం డైనమిక్స్ వారికి అనుకూలంగా లేకపోవచ్చు. ఈ ఆటగాళ్లు అమ్ముడుపోకపోతే ఆశ్చర్యపోనవసరం లేదు.