IPL Auction 2026 : వైభవ్ సూర్యవంశీ ఎఫెక్ట్.. ఎవరికీ తెలియని ఈ ఐదుగురిపై కోట్లు పెడితే కప్పు గ్యారంటీ

IPL Auction 2026 : ఐపీఎల్ 2026 వేలంలో యువ ఆటగాళ్లపై భారీగా నోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. వీరు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియకపోయినా, వారిలో భవిష్యత్తులో స్టార్ ప్లేయర్‌లు అయ్యేంత కెపాసిటీ ఉంది. గత వేలంలో వైభవ్ సూర్యవంశీకి ఊహించని ధర పలికినట్లే, ఈసారి కూడా అలాంటి అనామక ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.

IPL Auction 2026 : వైభవ్ సూర్యవంశీ ఎఫెక్ట్.. ఎవరికీ తెలియని ఈ ఐదుగురిపై కోట్లు పెడితే కప్పు గ్యారంటీ
Ipl Auction 2026

Updated on: Dec 15, 2025 | 7:52 PM

IPL Auction 2026 : ఐపీఎల్ 2026 వేలంలో యువ ఆటగాళ్లపై భారీగా నోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. వీరు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియకపోయినా, వారిలో భవిష్యత్తులో స్టార్ ప్లేయర్‌లు అయ్యేంత కెపాసిటీ ఉంది. గత వేలంలో వైభవ్ సూర్యవంశీకి ఊహించని ధర పలికినట్లే, ఈసారి కూడా అలాంటి అనామక ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ యువ ఆటగాళ్లలో 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేసే ప్లేయర్‌తో పాటు విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ, కేకేఆర్ వంటి టీమ్స్‌ను ఆకట్టుకున్న ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఆ ఐదుగురు ప్లేయర్స్, వారి ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.

1. కరణ్ లాల్ – బెంగాల్

బెంగాల్‌కు చెందిన 25 ఏళ్ల బ్యాట్స్‌మన్ కరణ్ లాల్ ఈ ఐపీఎల్ వేలంలో మంచి ధర దక్కించుకోవచ్చు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో ఈ ఆటగాడు కేవలం 50 బంతుల్లో 113 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఆ తర్వాత ఆర్‌సీబీ ట్రయల్స్‌కు వెళ్లినప్పుడు, అక్కడ 17 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. సుయష్ శర్మ ఓవర్‌లో రెండు, నవదీప్ సైనీ ఓవర్‌లో మూడు సిక్సర్లు కొట్టి, టీమ్స్‌ దృష్టిని ఆకర్షించాడు.

2. కార్తీక్ శర్మ – రాజస్థాన్

రాజస్థాన్‌కు చెందిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ కార్తీక్ శర్మపై కూడా భారీగానే పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ ఆటగాడు వికెట్ కీపర్‌గా ఉండటంతో పాటు, ఫినిషర్ పాత్రను కూడా చక్కగా పోషిస్తాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్‌లలో 133 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 160 కంటే ఎక్కువగా ఉంది. ఈ విధ్వంసక హిట్టర్‌ను ఇటీవల రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ చోప్రా వంటి దిగ్గజాలు కూడా ప్రశంసించారు.

3. అశోక్ శర్మ – రాజస్థాన్

రాజస్థాన్‌కు చెందిన మరో ఆటగాడు అశోక్ శర్మ డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది. ఈ ఫాస్ట్ బౌలర్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఏకంగా 20 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా అశోక్ శర్మ వేగం 145 కి.మీ/గం కంటే ఎక్కువగా ఉండి, కొన్నిసార్లు 150 కి.మీ/గం మార్కును కూడా చేరుకుంటాడు. అతని స్పీడు లక్నో, చెన్నై వంటి జట్లకు బాగా ఆకర్షణీయంగా ఉంటుంది.

4. తుషార్ రమేశ్ రెహేజా – తమిళనాడు

తమిళనాడుకు చెందిన మరో వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ తుషార్ రమేశ్ రెహేజా కూడా ఐపీఎల్ 2026 వేలంలో మంచి బిడ్ దక్కించుకోవచ్చు. ఈ స్టార్ ఆటగాడు ప్రస్తుత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్‌లలో 151 పరుగులు చేశాడు, అతని స్ట్రైక్ రేట్ 164.13గా ఉంది. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా అతని దూకుడు, ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ వంటి టీమ్‌లకు ప్రయోజనం చేకూర్చవచ్చు.

5. ఆకిబ్ నబీ – జమ్మూ కాశ్మీర్

జమ్మూ-కాశ్మీర్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీపై కూడా భారీ డబ్బు కురిసే అవకాశం ఉంది. ఈ రైట్ ఆర్మ్ పేసర్ రంజీ ట్రోఫీ నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ వరకు అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఆకిబ్ నబీ త్వరలోనే టీమిండియాలో కూడా కనిపించవచ్చని అంచనా ఉంది. ఈ టాలెంటెడ్ ఆటగాడి కోసం అనేక ఐపీఎల్ టీమ్స్ పోటీ పడవచ్చు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..