IPL 2023 Auction: 25 ఏళ్లలోపు ఆటగాళ్లపై కనక వర్షం.. 35+లో కేవలం 5గురే.. ఒక్కో ప్లేయర్‌పై ఎంత ఖర్చు పెట్టారంటే?

|

Dec 24, 2022 | 1:19 PM

Young Players in IPL 2023 Auction: ఈసారి ఐపీఎల్ వేలంలో 25 ఏళ్లలోపు 27 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు. వీళ్లపై ఫ్రాంచైజీలు మొత్తం రూ.71.1 కోట్లు వెచ్చించాయి.

IPL 2023 Auction: 25 ఏళ్లలోపు ఆటగాళ్లపై కనక వర్షం.. 35+లో కేవలం 5గురే.. ఒక్కో ప్లేయర్‌పై ఎంత ఖర్చు పెట్టారంటే?
Ipl Mini Auction 2023
Follow us on

ఈసారి ఐపీఎల్ మినీ వేలంలో మొత్తం 80 మంది ఆటగాళ్లు రూ.167 కోట్లకు అమ్ముడయ్యారు. ఈ 80 మంది ఆటగాళ్లలో యువత సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. 30 ఏళ్లలోపు 55 మంది ఆటగాళ్లు ఫ్రాంచైజీల మనసు దోచుకోగా, 30 ఏళ్లు పైబడిన 25 మంది ఆటగాళ్లు కూడా అమ్ముడయ్యారు. అయితే 35 ఏళ్లు దాటిన వారి విక్రయాల సంఖ్య 5 మాత్రమే ఉండడం గమనార్హం.

ఈసారి ఐపీఎల్ ఫ్రాంచైజీలు యువతపై భారీగా డబ్బులు ఖర్చు పెట్టారు. 25 ఏళ్లలోపు 27 మంది ఆటగాళ్లపై రూ.71.1 కోట్లు వెచ్చించారు. అంటే ఒక్కో ఆటగాడికి రూ.2.63 కోట్లు వెచ్చించారు. 25 నుంచి 29 ఏళ్లలోపు 28 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు. ఈ 28 మంది ఆటగాళ్లపై రూ.38.9 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంటే ఇక్కడ ఒక్కో ఆటగాడికి రూ.1.39 కోట్లు ఖర్చు చేశారు. 30 నుంచి 34 ఏళ్లలోపు 20 మంది ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు రూ. 51.5 కోట్లు వెచ్చించారు. ఇక్కడ ఒక్కో ఆటగాడి సగటు రూ.2.58 కోట్లుగా నిలిచింది. 35 ఏళ్లు పైబడిన ఐదుగురు ఆటగాళ్లు రూ. 5.5 కోట్లకు అమ్ముడయ్యారు. ఈ వయస్సు విభాగంలో ఒక్కో ఆటగాడి సగటు ధర రూ. 1.10 కోట్లుగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

25 ఏళ్లలోపు ముగ్గురు అత్యంత ఖరీదైన ఆటగాళ్లు..

ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా సామ్ కరణ్ నిలిచారు. రూ.18.5 కోట్ల ధర పలికాడు. అతని వయస్సు కేవలం 24 సంవత్సరాలు. అదేవిధంగా వేలంలో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడు కామెరాన్ గ్రీన్ వయసు 23 ఏళ్లు మాత్రమే. రూ. 17.5 కోట్లకు కొన్నారు. వీరిద్దరూ కాకుండా ఇంగ్లండ్‌కు చెందిన 23 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ కూడా రూ.13.25 కోట్లకు అమ్ముడయ్యాడు. దీంతో ఈసారి ఫ్రాంచైజీలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లను వేలంలో కొన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..