AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Points Table : సన్‌రైజర్స్ గెలుపుతో గుజరాత్ పంట పండింది.. ప్లేఆఫ్స్ నుంచి చెన్నై అవుట్ అయినట్టేనా?

IPL 2026 Points Table : ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక అప్‌డేట్. సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపుతో ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంది. ఈ ఫలితంతో గుజరాత్ కూడా క్వాలిఫై అవ్వగా, చెన్నై అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. మిగిలిన జట్లు ఓడిపోతేనే చెన్నైకు ఛాన్స్ ఉంటుంది.

IPL 2026 Points Table : సన్‌రైజర్స్ గెలుపుతో గుజరాత్ పంట పండింది.. ప్లేఆఫ్స్ నుంచి చెన్నై అవుట్ అయినట్టేనా?
Ipl 2026 Points Table
Rakesh
|

Updated on: May 19, 2026 | 7:07 AM

Share

IPL 2026 Points Table : ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు రావడంతో ప్లేఆఫ్స్ ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. సోమవారం రాత్రి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన 63వ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టిక తలకిందులైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగిన ఈ పోరులో గెలిచింది ఒక్క టీమే అయినా.. ఆ ఫలితం వల్ల ఏకంగా ఇద్దరు ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారు చేసుకున్నారు. ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని హైదరాబాద్ టీమ్ ప్లేఆఫ్స్‌లోకి గర్జన చేస్తూ అడుగుపెట్టగా, వారితో పాటు గుజరాత్ టైటాన్స్‌కు కూడా లైన్ క్లియర్ అయిపోయింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో చెన్నైని ఓడించడంతో వారి పాయింట్లు 16కు చేరాయి. ప్రస్తుతం 13 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ 16 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇదే సమయంలో గుజరాత్ టైటాన్స్ కూడా 13 మ్యాచ్‌లలో 16 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. నెట్ రన్ రేట్ పరంగా గుజరాత్ (+0.400) కంటే హైదరాబాద్ (+0.350) కాస్త వెనుకబడి ఉన్నా.. ఇద్దరికీ సమాన పాయింట్లు ఉండటం, మిగిలిన జట్ల సమీకరణాలు మారడంతో ఈ రెండు టీమ్స్ ప్లేఆఫ్స్ టికెట్ దక్కించుకున్నాయి. ఇప్పుడు కేవలం ఒక్క ప్లేఆఫ్ బెర్త్ కోసం మాత్రమే పోటీ నెలకొంది.

ప్రస్తుత లెక్కల ప్రకారం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఇప్పటికే టాప్ ప్లేస్‌లో ఉండగా, ఇప్పుడు గుజరాత్, హైదరాబాద్ జాయిన్ అయ్యాయి. ఇక మిగిలిన నాలుగో స్థానం కోసం రాజస్థాన్ రాయల్స్ రేసులో ఉంది. రాజస్థాన్ తన తదుపరి మ్యాచ్‌లో గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెడుతుంది. ఒకవేళ రాజస్థాన్ ఓడిపోతే మాత్రం పాయింట్ల పట్టికలో కింద ఉన్న ఐదు జట్ల మధ్య మళ్ళీ హోరాహోరీ పోరు మొదలవుతుంది. అంటే టాప్-4 రేసు ఇప్పుడు కేవలం ఒకే ఒక స్థానం చుట్టూ తిరుగుతోంది.

చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఏంటి?

సొంత మైదానంలో జరిగిన చివరి మ్యాచ్‌లో ఓడిపోవడం చెన్నైకి కోలుకోలేని దెబ్బ. ప్రస్తుతం సీఎస్‌కే 13 మ్యాచ్‌లలో 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఈ ఓటమితో రుతురాజ్ సేన ప్లేఆఫ్స్ అవకాశాలు 90 శాతం దెబ్బతిన్నాయి. చెన్నై తన ఆఖరి మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. అలా గెలిచినా కూడా అది ప్లేఆఫ్స్‌కు సరిపోదు. రాజస్థాన్ రాయల్స్ తన మిగిలిన మ్యాచ్‌లలో ఓడిపోవాలి, అలాగే పంజాబ్, ఢిల్లీ వంటి ఇతర జట్లు కూడా భారీ తేడాతో ఓడిపోతే తప్ప సీఎస్‌కేకు అదృష్టం కలిసిరాదు. ప్రస్తుతం చెన్నై ప్లేఆఫ్స్ చేరడం అనేది అద్భుతం జరిగితేనే సాధ్యం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us