IPL 2026 Points Table : వరుసగా రెండో విజయం… ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో దూసుకొచ్చిన చెన్నై సూపర్ కింగ్స్

IPL 2026 Points Table : చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన 22వ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పై 32 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.

IPL 2026 Points Table : వరుసగా రెండో విజయం... ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో దూసుకొచ్చిన చెన్నై సూపర్ కింగ్స్
Ipl 2026 Points Table (6)

Updated on: Apr 15, 2026 | 7:03 AM

IPL 2026 Points Table : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన 22వ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పై 32 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. సీజన్ ఆరంభంలో వరుసగా మూడు ఓటములతో బెంబేలెత్తిన ధోనీ సేన, ఇప్పుడు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి ఫామ్‌లోకి వచ్చింది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. చెపాక్ పిచ్‌పై ఈ స్కోరును ఛేదించడం కేకేఆర్‌కు కష్టతరంగా మారింది. కేవలం 160 పరుగులకే కోల్‌కతా జట్టును కట్టడి చేసిన సీఎస్‌కే బౌలర్లు, 32 పరుగుల తేడాతో విజయాన్ని అందించారు. మొదటి మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయినప్పటికీ, ఇప్పుడు వరుసగా రెండు విజయాలు సాధించడం టీమ్ కాన్ఫిడెన్స్‌ను అమాంతం పెంచేసింది.

పాయింట్ల పట్టికలో సీఎస్‌కే పరిస్థితి

ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ 9వ స్థానం నుంచి 8వ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ఆడిన 5 మ్యాచ్‌లలో 2 విజయాలు, 3 ఓటములతో 4 పాయింట్లు సాధించింది. అయితే, సీఎస్‌కేకు నెట్ రన్ రేట్ (-0.846) ఇంకా మైనస్‌లోనే ఉండటం పెద్ద తలనొప్పిగా మారింది. వచ్చే మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధిస్తేనే ప్లే-ఆఫ్ రేసులో నిలబడటం సులభమవుతుంది.

అట్టడుగున కోల్‌కతా నైట్ రైడర్స్

మరోవైపు కేకేఆర్ పరిస్థితి ఈ సీజన్‌లో చాలా ఘోరంగా ఉంది. ఆడిన 5 మ్యాచ్‌లలో ఒక్కటి కూడా గెలవలేకపోయింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో కేవలం 1 పాయింట్‌తో చివరి స్థానంలో కొనసాగుతోంది. కేకేఆర్ నెట్ రన్ రేట్ (-1.383) అన్ని టీమ్‌ల కంటే అత్యంత దారుణంగా ఉండటం వారి ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేస్తోంది.

టాప్ ప్లేస్‌లో ఎవరెవరు?

ప్రస్తుతానికి రాజస్థాన్ రాయల్స్ తన అజేయ పరంపరను కొనసాగిస్తూ 5 మ్యాచ్‌లలో 4 విజయాలు, 8 పాయింట్లతో టేబుల్ టాప్ లో ఉంది. పంజాబ్ కింగ్స్ 7 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, ఆర్సీబీ 6 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) 5 మ్యాచ్‌ల్లో 2 గెలిచి నాలుగో స్థానంలో ఉంది. మిగిలిన జట్లు అంటే ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో కూడా తలో 2 విజయాలతో రేసులో ఉన్నాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us