AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Playoffs : రేసు నుంచి ముంబై, లక్నో అవుట్.. సీఎస్కే పరిస్థితి అగమ్యగోచరం.. మరి రాజస్థాన్ రాయల్స్‌ పరిస్థితి ?

IPL Playoffs : ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్, జీటీ జట్లు 80% అవకాశాలతో ముందుండగా సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.ఈ మూడు జట్లు ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో సమంగా ఉన్నాయి.

IPL Playoffs : రేసు నుంచి ముంబై, లక్నో అవుట్.. సీఎస్కే పరిస్థితి అగమ్యగోచరం.. మరి రాజస్థాన్ రాయల్స్‌ పరిస్థితి ?
Ipl 2026
Rakesh
|

Updated on: May 12, 2026 | 10:18 AM

Share

IPL Playoffs : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. లీగ్ దశ ముగియడానికి మరో రెండు వారాల సమయం కూడా లేదు, కానీ ఇప్పటివరకు ఏ ఒక్క జట్టు కూడా అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోలేదు. పాయింట్ల పట్టికలో ప్రతి రోజూ సమీకరణాలు మారిపోతున్నాయి. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓడిపోవడంతో రేసు మరింత రసవత్తరంగా మారింది. ప్రస్తుతం మూడు జట్లు ప్లేఆఫ్స్ రేసులో దాదాపు 80 శాతం అవకాశాలతో ముందుండగా, చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు గండం గట్టెక్కేందుకు కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ల లెక్కల ప్రకారం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మూడు జట్లు ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో సమంగా ఉన్నాయి. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్కటి గెలిచినా వీరు 16 పాయింట్ల మ్యాజిక్ ఫిగర్‎కు చేరుకుంటారు. అందుకే ఈ జట్లు క్వాలిఫై అయ్యేందుకు 80 శాతం అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి ఏంటి?

గత సీజన్ల ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, వైభవ్ సూర్యవంశీ ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్రస్తుతం డైలమాలో ఉన్నాయి. ఈ రెండు జట్లు 11 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నాయి. సీఎస్కే ప్లేఆఫ్స్ చేరే అవకాశం 42.7 శాతంగా ఉండగా, రాజస్థాన్ రాయల్స్ ఛాన్స్ 41.8 శాతంగా ఉంది. ఈ రెండు జట్లు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండింటిలో గెలిస్తేనే రేసులో నిలబడతాయి. లేదంటే ఇతర జట్ల ఓటములపై ఆధారపడాల్సి ఉంటుంది.

పంజాబ్ కొంపముంచిన ఢిల్లీ

పంజాబ్ కింగ్స్ జట్టుకు ఢిల్లీపై గెలిచే అవకాశం ఉన్నప్పటికీ, ఫీల్డింగ్, బౌలింగ్ లోపాల వల్ల ఓటమి పాలైంది. ప్రస్తుతం పంజాబ్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. వీరు ప్లేఆఫ్స్ చేరే అవకాశం 62.5 శాతంగా ఉంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ (1.2 శాతం), కోల్‌కతా నైట్ రైడర్స్ (11.6 శాతం) జట్లకు టెక్నికల్‎గా అవకాశాలు ఉన్నప్పటికీ, అవి చాలా తక్కువ. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే ఈ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి.

ఇదే అసలైన మ్యాజిక్ నంబర్

2022లో ఐపీఎల్ 10 జట్ల టోర్నీగా మారినప్పటి నుంచి, ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే 16 పాయింట్లు కనీస అవసరంగా మారాయి. గత మూడు సీజన్లలో నాలుగో స్థానంలో నిలిచిన జట్లన్నీ 16 పాయింట్లతోనే క్వాలిఫై అయ్యాయి. కేవలం 2024లో మాత్రమే నెట్ రన్ రేట్ ఆధారంగా 14 పాయింట్లతో ఆర్సీబీ ముందుకు వెళ్లింది. ఈసారి కూడా 16 పాయింట్లు సాధించిన జట్లు దాదాపు సురక్షితంగా ఉంటాయి. ఒకవేళ ఏవైనా జట్లు 14 పాయింట్ల వద్ద ఆగిపోతే, అప్పుడు నెట్ రన్ రేట్ వార్ మొదలవుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us