
Watch : ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ పరుగుల విధ్వంసం సృష్టించాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో, తుది జట్టులోకి వచ్చిన వెంకటేష్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 40 బంతుల్లోనే 73 పరుగులు బాది అజేయంగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతని బ్యాటింగ్ కంటే కూడా హాఫ్ సెంచరీ తర్వాత చేసిన సెలబ్రేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కోలీవుడ్ సూపర్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ ఐకానిక్ పోజ్‌ను వెంకటేష్ అనుకరించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
వెంకటేష్ అయ్యర్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే బ్యాట్‌ను పక్కన పెట్టి, విజయ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మెర్సల్లోని ఫేమస్ పోజ్‌ను ప్రదర్శించాడు. మైదానంలో అతను రెండు చేతులు చాచి విజయ్ స్టైల్‌ను రిప్లికేట్ చేయడంతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. వెంకటేష్ అయ్యర్ స్వతహాగా విజయ్‌కి పెద్ద ఫ్యాన్ కావడంతో, తన సక్సెస్‌ను ఇలా ఫేవరెట్ హీరో స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం ఎక్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
Seizing the opportunity in style 👌
Updates ▶️ https://t.co/3u5qL0Zn75#TATAIPL | #KhelBindaas | #PBKSvRCB | @venkateshiyer pic.twitter.com/VMHmF39cr5
— IndianPremierLeague (@IPL) May 17, 2026
నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన వెంకటేష్ అయ్యర్.. పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఒకవైపు విరాట్ కోహ్లీ (58) అవుట్ అయినా, మరోవైపు క్రీజులో పాతుకుపోయిన వెంకటేష్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి తోడుగా దేవదత్ పడిక్కల్ (45), చివర్లో టిమ్ డేవిడ్ (28) మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోరును సాధించింది. పంజాబ్ బౌలర్లు హర్ప్రీత్ బ్రార్ వంటి వారు వికెట్లు తీసినా, వెంకటేష్ దూకుడును మాత్రం అడ్డుకోలేకపోయారు.
వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆర్సీబీ, ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోరు సాధించి పంజాబ్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకున్న మొదటి జట్టుగా ఆర్సీబీ నిలవనుంది. మరోవైపు వరుసగా 5 మ్యాచ్‌లు ఓడిపోయిన పంజాబ్ కింగ్స్‌కు ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యంగా కనిపిస్తోంది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన 100వ కెప్టెన్సీ మ్యాచ్‌లో జట్టును గెలిపించుకోలేకపోతే ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..