IPL 2026: ‘మా దగ్గర డబ్బులు లేవు సర్’.. కట్ చేస్తే.. అంబానీ మావ మాస్టర్ స్ట్రోక్ చూస్తే మైండ్ పోతుంది

ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ మినీ వేలంలో ముంబై ఇండియన్స్ వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కేవలం రూ. 2.75 కోట్ల పర్స్‌తో బరిలోకి దిగి.. తమకు కావాల్సిన కీలక ఆటగాళ్లను తెలివిగా చేజిక్కించుకుంది. ఇంకా చెప్పాలంటే విధ్వంసకర ప్లేయర్‌ను కేవలం రూ. కోటికే దక్కించుకుంది. ఆ వివరాలు..

IPL 2026: మా దగ్గర డబ్బులు లేవు సర్.. కట్ చేస్తే.. అంబానీ మావ మాస్టర్ స్ట్రోక్ చూస్తే మైండ్ పోతుంది
Mumbai Indians

Updated on: Dec 18, 2025 | 7:26 AM

ఐపీఎల్ 2026 మినీ వేలం ముగిసింది. కానీ అందులో ముంబై ఇండియన్స్ వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. తెలివైన వ్యూహాలను సిద్దం చేసుకుని.. మంచి ప్లేయర్స్‌ను తక్కువ ధరకే చేజిక్కించుకుంది. ‘మా దగ్గర డబ్బులు లేవు సర్’ అంటూ చెప్పిన అంబానీ ఫ్రాంచైజీ.. కేవలం రూ. 2.75 కోట్లతోబరిలోకి దిగి.. తమకు అవసరమైన ఆటగాళ్లను సమర్థవంతంగా కొనుగోలు చేసింది. 2019లో తమ జట్టు తరపున బరిలోకి దిగిన సౌతాఫ్రికా విధ్వంసకర ప్లేయర్ క్వింటన్ డికాక్‌ను కేవలం రూ. 1 కోటికే తిరిగి జట్టులోకి చేర్చుకుంది. రికిల్‌ట్టన్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు డికాక్. డికాక్‌తో పాటు డానిష్ మలేవార్, మహమ్మద్ ఇజార్, అధర్వ అంకోలేకర్, మయాంక్ రావత్ లాంటి యువ ఆటగాళ్లను రూ. 30 లక్షల చొప్పున కొనుగోలు చేసింది.

ఇదిలా ఉంటే.. వేలానికి ముందే ముంబై మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. లక్నో నుంచి శార్దుల్ ఠాకూర్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, మయాంక్ మార్కండేయలను ట్రేడ్ చేసింది. అలాగే తన జట్టులోని అర్జున్ టెండూల్కర్‌ను లక్నోకు ట్రేడ్ ఇచ్చి.. జట్టును బలోపేతం చేసుకుంది. ఎలాగో ప్రధాన ఆటగాళ్ల రిటైన్, పక్కా ట్రేడ్స్.. వెరిసి.. ముంబైకి వేలంలో పెద్దగా పని లేకుండా పోయింది. దీంతో తక్కువ బడ్జెట్‌తోనే మంచి ప్లేయర్స్‌ను రాబట్టుకుంది. ఇక కాగితంపై చూస్తే ముంబై జట్టు పటిష్టంగా కనిపిస్తోంది.

ముంబై రిటైన్ లిస్టు ఇలా..

హార్దిక్ పాండ్యా – రూ. 18 కోట్లు,

రోహిత్ శర్మ – రూ. 16.30 కోట్లు,

జస్ప్రీత్ బుమ్రా – రూ. 18 కోట్లు,

సూర్యకుమార్ యాదవ్ – రూ. 16.35 కోట్లు,

తిలక్ వర్మ – రూ. 8 కోట్లు,

నమన్ ధీర్ – రూ. 5.25 కోట్లు,

ట్రెండ్ బౌల్ట్ – రూ. 12.50 కోట్లు,

ర్యాన్ రికిల్‌ట్టన్‌ – రూ. 1కోటి,

దీపక్ చాహర్ – రూ. 9.25 కోట్లు,

విల్ జాక్స్ – రూ. 5.25 కోట్లు,

అశ్విని కుమార్ – రూ. 30 లక్షలు,

మిచెల్ సాంట్నార్ – రూ. 2 కోట్లు,

రాజ్ భవ – రూ. 30 లక్షలు,

రాబిన్ మింజ్ – రూ. 65 లక్షలతో రిటైన్ చేసుకుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి