CSK: చెన్నైలో చేరినా శాంసన్ దద్దమ్మనే.. పెత్తనం అంతా ధోనిదే..

చెన్నై జట్టుకు ఎంతమంది కెప్టెన్‌లు మారినా.. ధోనిదే పెత్తనం అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అలాగే తాజాగా ఈ చర్చపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కూడా స్పందించాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా పేపర్ కెప్టెన్ అని.. ధోని షాడో కెప్టెన్ అని అన్నాడు.

CSK: చెన్నైలో చేరినా శాంసన్ దద్దమ్మనే.. పెత్తనం అంతా ధోనిదే..
Csk Ipl 2026

Updated on: Nov 20, 2025 | 7:15 PM

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో మహేంద్ర సింగ్ ధోనీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 2008లో చెన్నై ఫ్రాంచైజీలో చేరిన ధోని.. అప్పటి నుంచి ధోని అంటే సీఎస్కే.. సీఎస్కే అంటే ధోనిలా మారిపోయింది. ‘నాట్ ఎట్’ అంటూ ధోని కూడా తనకు బాడీ సహకరించినంత వరకు ఐపీఎల్ ఆడాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా ఐపీఎల్ 2026లో మైదానంలోకి దిగుతాడు ధోని. ఇదిలా ఉంటే.. తాజాగా సంచలన ట్రేడ్‌తో రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకుంది చెన్నై. అతడు జట్టులో చేరినా.. తమ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అని స్పష్టం చేసింది సీఎస్కే యాజమాన్యం. అయితే రుతురాజ్ గైక్వాడ్ పేపర్ కెప్టెన్ మాత్రమేనని.. జట్టు పెత్తనమంతా ధోనీదేనంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనిపై తాజాగా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కూడా స్పందించాడు.

ధోని జట్టులో ఉన్నంతకాలం రుతురాజ్ గైక్వాడ్ కేవలం ‘పేపర్ కెప్టెన్’ మాత్రమేనని మహమ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. జట్టు కెప్టెన్‌గా ధోని లేకపోయినా.. అతడి ఆధిపత్యం కొనసాగుతుందని.. జట్టును ‘షాడో కెప్టెన్’గా నడిపిస్తాదని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ నుంచి జట్టులో చేరిన సంజూ శాంసన్ కూడా వట్టి దద్దమ్మ అని.. భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా అతడ్ని తీసుకున్నారని ఫ్యాన్స్ అంటున్నారు. ధోని స్థానాన్ని సంజూ శాంసన్ భర్తీ చేస్తాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అలాగే రాయల్స్ జట్టులో ఉన్నప్పుడు కూడా శాంసన్ తన అభిప్రాయాలను కెప్టెన్‌గా పరిగణనలోకి తీసుకోలేదని.. బయటకు వచ్చాడు.. ఇప్పుడు కూడా సైలెంట్‌గా ఉండాలని చెన్నైకి ధోనినే అంతా అని సీఎస్కే ఫ్యాన్స్ అంటున్నారు.