
ఐపీఎల్ 2025లో ఫర్వాలేదనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్.. వచ్చే సీజన్‌లో ఎలాగైనా ప్లేఆఫ్స్‌కి చేరాలని లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించని ఆటగాళ్లతో పాటు బెంచ్ బలం పెంచేందుకు ఇంకొందరు ఆటగాళ్ళను విడుదల చేసేందుకు సిద్దమైంది. అలాగే మినీ వేలంలో ఓ ముగ్గురు బ్యాటర్లపై కన్నేసింది ఢిల్లీ క్యాపిటల్స్.. మరి వారెవరో ఇప్పుడు తెలుసుకుందామా..
ముందుగా రిలీజ్ లిస్టు గురించి చూస్తే.. ప్రధానంగా ఫస్ట్ ప్లేస్‌లో జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ ఉంటాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్‌ను గత సంవత్సరం మెగా వేలం ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ. 9 కోట్లు పెట్టి అట్టిపెట్టుకుంది. అయితే అతడు కాస్తా నిరాశపరిచాడు. సో ఫస్ట్ లేఆఫ్ మనోడికి పక్కా. ఆ తర్వాత మిడిలార్డర్‌లో హ్యారీ బ్రూక్‌ను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేయనుంది. రూ. 6.25 కోట్లతో ఈ ఆటగాడిని ఢిల్లీ జట్టు కొనుగోలు చేయగా.. అర్ధాంతరంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. అటు హైదరాబాద్ జట్టులో ఉన్నప్పుడు బ్రూక్ ప్రదర్శన అంతగా బాగోలేదు. వీరిద్దరి స్థానాల్లో ఓ రెండు హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ల కోసం ఢిల్లీ ప్రయత్నాలు సాగిస్తోంది.
వారే ఫిన్ అలెన్, జానీ బెయిర్‌స్టో. ఈ ఇద్దరికీ ఓపెనింగ్ బ్యాటింగ్‌లో అంతర్జాతీయంగా మంచి అనుభవం ఉంది. అలాగే ఫిన్ అలెన్ 2021లో RCB తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడగా.. జానీ బెయిర్‌స్టో 2025 IPLలో ముంబై ఇండియన్స్ తరఫున రెండు మ్యాచ్‌లు.. అలాగే గతంలో హైదరాబాద్ జట్టుకు ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేశాడు. వీరితో పాటు మిడిలార్డర్‌లో షిమ్రాన్ హెట్మెయర్‌ను టార్గెట్ చేస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్. 2025 IPLలో హెట్మెయర్ పేలవమైన ప్రదర్శన కారణంగా రాజస్థాన్ రాయల్స్ అతన్ని విడుదల చేయాలని భావిస్తోంది. అయితే ఎంతగా ఫామ్ కోల్పోయినప్పటికీ.. హెట్మెయర్ మంచి ఫినిషర్ అని.. కచ్చితంగా విధ్వంసం సృస్టించగలడని ఢిల్లీ అనుకుంటోంది.
ఇక చివరిగా ఢిల్లీ క్యాపిటల్స్.. హైదరాబాద్ జట్టు OG బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌పై కన్నేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ హెన్రిచ్ క్లాసెన్‌ను విడుదల చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఇది సన్‌రైజర్స్ చేసే పెద్ద పొరపాటు అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక క్లాసెన్ మినీ వేలంలోకి వస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ కోట్లు ఖర్చయినా పర్లేదు అతడ్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.