ఆ ఇద్దరి కోసం శివంగుల సిగపట్లు.. వేలంలో ‘కావ్యా మారన్ vs ప్రీతిజింటా vs నీతా అంబానీ’ పోరు తప్పేలా లేదగా..

IPL 2026 Auction: మొత్తానికి ఐపీఎల్ 2026 వేలంలో ఈ ఇద్దరు ఆటగాళ్ల కోసం రికార్డు స్థాయి ధరలు పలికే అవకాశం ఉంది. కావ్యా మారన్, ప్రీతి జింటా, నీతా అంబానీల మధ్య జరగబోయే ఈ 'బిడ్డింగ్ వార్' ఎలా ఉండబోతుందో చూడాలి.

ఆ ఇద్దరి కోసం శివంగుల సిగపట్లు.. వేలంలో కావ్యా మారన్ vs ప్రీతిజింటా vs నీతా అంబానీ పోరు తప్పేలా లేదగా..
Ipl 2026 Auction

Updated on: Dec 11, 2025 | 1:12 PM

IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలానికి (IPL 2026 Mini Auction) సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఫ్రాంచైజీల మధ్య పోటీ ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా ముగ్గురు మహిళా యజమానులు – సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ కావ్యా మారన్, పంజాబ్ కింగ్స్ (PBKS) ఓనర్ ప్రీతి జింటా, ముంబై ఇండియన్స్ (MI) యజమాని నీతా అంబానీ.. ఇద్దరు స్టార్ ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ముగ్గురు యజమానులు ఎంత ధరకైనా సరే తమ జట్టులో చేర్చుకోవాలని భావిస్తున్న ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

1. కామెరాన్ గ్రీన్ (Cameron Green): ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ కోసం ఈ మూడు జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది. అందుకుగల కారణం, గ్రీన్ అద్భుతమైన హిట్టర్, వికెట్లు తీయగల బౌలర్. కాగా, గతంలో గ్రీన్ ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. నీతా అంబానీ అతన్ని తిరిగి ముంబై గూటికి చేర్చడానికి ప్రయత్నించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Team India: టీ20ల్లో తోపు బౌలర్.. కట్‌చేస్తే.. ప్రతీసారి హ్యాండిస్తోన్న గంభీర్.. ఎవరంటే?

పంజాబ్, హైదరాబాద్: ప్రీతి జింటా (పంజాబ్)కు ఒక బలమైన ఆల్ రౌండర్ అవసరం ఉంది. అలాగే, దూకుడుగా ఆడే ఆటగాళ్లను ఇష్టపడే కావ్యా మారన్ (SRH) కూడా గ్రీన్ కోసం భారీగా ఖర్చు చేయడానికి వెనుకాడకపోవచ్చు. ఇతని కోసం రూ. 40 కోట్ల వరకు వెచ్చించే అవకాశముందని అంచనా.

ఇది కూడా చదవండి: పక్కన పెట్టలేరు.. పరుగులు రాబట్టలేరు.. టీమిండియాకు ‘భారం’గా ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు..!

2. రవి బిష్ణోయ్ (Ravi Bishnoi): భారత యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా ఈ ముగ్గురి హిట్ లిస్టులో ఉన్నాడు.

ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లలో నాణ్యమైన స్పిన్నర్ల అవసరం చాలా ఉంది. 4 ఓవర్లలో తక్కువ పరుగులిచ్చి వికెట్లు తీయగల బిష్ణోయ్ వంటి బౌలర్ వారికి చాలా కీలకం. పంజాబ్ కింగ్స్ కూడా తమ స్పిన్ విభాగాన్ని బలోపేతం చేసుకోవడానికి బిష్ణోయ్ వైపు చూస్తోంది.

మొత్తానికి ఐపీఎల్ 2026 వేలంలో ఈ ఇద్దరు ఆటగాళ్ల కోసం రికార్డు స్థాయి ధరలు పలికే అవకాశం ఉంది. కావ్యా మారన్, ప్రీతి జింటా, నీతా అంబానీల మధ్య జరగబోయే ఈ ‘బిడ్డింగ్ వార్’ ఎలా ఉండబోతుందో చూడాలి.