IPL 2026: ముంబై ఇండియన్స్‌లో ఆంధ్రా కింగ్.. మనోడి స్లో బాల్ దెబ్బకు తోపులైనా తోకముడవాల్సిందే..!

Satyanarayana Raju IPL 2026: ఐపీఎల్ 2026లో తెలుగు రాష్ట్రాలను నుంచి కొంతమంది ప్లేయర్లు బరిలోకి నిలిచారు. అయితే, వీరిలో ఇప్పటికే తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా ఆడుతూ పేరు తెచ్చుకున్నారు. ఈ లిస్టులో ఈ ఏడాది మరికొంతమంది ప్లేయర్లు నిలిచారు. వారిలో ముఖ్యంగా సత్యనారాయణ రాజు ముందు వరుసలో ఉంటాడు.

IPL 2026: ముంబై ఇండియన్స్‌లో ఆంధ్రా కింగ్.. మనోడి స్లో బాల్ దెబ్బకు తోపులైనా తోకముడవాల్సిందే..!
Satyanarayana Raju Ipl 2026

Updated on: Mar 24, 2026 | 10:42 AM

Satyanarayana Raju IPL 2026: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన పెనుమత్స వెంకట సత్యనారాయణ రాజు, ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ (MI) జట్టులో అత్యంత ఆసక్తికరమైన బౌలర్‌గా ఎదిగాడు. గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో తన ఐపీఎల్ అరంగేట్రం చేసిన రాజు, బ్యాటర్లను తన స్లోయర్ బాల్స్‌తో తికమక పెట్టడంతో వెలుగులోకి వచ్చాడు. ముంబై ఇండియన్స్ ఇతనిని రూ. 30 లక్షలకు దక్కించుకోగా, బుమ్రా వంటి దిగ్గజాల నీడలో ఇతను రాటుదేలుతున్నాడు.

విద్యార్థి నుంచి విధ్వంసక బౌలర్ వరకు..

సత్యనారాయణ రాజు కేవలం క్రికెట్‌లోనే కాదు, చదువులోనూ టాప్. ఎంబీఏ పూర్తి చేసిన ఈ యువకుడు తన క్రికెట్ కలను మాత్రం వదల్లేదు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) లో భీమవరం బుల్స్ తరపున అద్భుతంగా రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్‌ను తన అత్యంత నెమ్మదైన బంతితో ఆశ్చర్యపరిచిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇది కూడా చదవండి: Team India: కెప్టెన్‌గా సంజూ శాంసన్.. ఓపెనర్‌గా సూర్యవంశీ.. ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు ఇదే..?

ఇవి కూడా చదవండి

సత్యనారాయణ రాజు కెరీర్ గణాంకాలు (ఐపీఎల్, దేశవాళీ)..

ఐపీఎల్ మ్యాచ్‌లు: 2 (2025 సీజన్ లో అరంగేట్రం)

ఐపీఎల్ బెస్ట్ బౌలింగ్: 1/40 (గుజరాత్ టైటాన్స్ పై)

విజయ హజారే ట్రోఫీ (2025-26): హర్యానాపై 5/44, గుజరాత్ పై 4/53 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు.

టీ20 కెరీర్: 13 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు.

ఇది కూడా చదవండి: PSLను ఛీకొట్టాడు.. కట్‌చేస్తే.. రూ. 2 కోట్లతో హారతి పట్టేసిన ఐపీఎల్.. అసలెవరీ ఆల్ రౌండర్..!

ముంబై జట్టులో భవిష్యత్తు..

ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ రాజులోని వైవిధ్యాన్ని గుర్తించింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఈ సీజన్ లో మరిన్ని అవకాశాలు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో వేగాన్ని మార్చడం ద్వారా పరుగులను నియంత్రించగల ఇతని సామర్థ్యం జట్టుకు అదనపు బలం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us