ఇక బ్యాగులు సర్దుకోవాల్సిందే.. భారత జట్టులోకి బుడ్డోడు.. 2 ఏళ్లలో దుమ్ములేపుడే

Vaibhav Suryavanshi: బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్ సూర్యవంశీ, కేవలం 12 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి, రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత అండర్-19 టెస్టుల్లో ఆస్ట్రేలియాపై వేగవంతమైన సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ అతన్ని రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది.

ఇక బ్యాగులు సర్దుకోవాల్సిందే.. భారత జట్టులోకి బుడ్డోడు.. 2 ఏళ్లలో దుమ్ములేపుడే
Vaibhav Suryavanshi

Updated on: May 24, 2025 | 10:06 AM

Vaibhav Suryavanshi: కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో సంచలనం సృష్టించిన యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించాడు. అయితే, ఈ బుడ్డోడి భష్యత్తుపై అతని చిన్ననాటి కోచ్ అశోక్ కుమార్ భారీ అంచనాలను వ్యక్తం చేశారు. రాబోయే రెండేళ్లలో వైభవ్ భారత సీనియర్ టీ20 జట్టులో స్థానం సంపాదించుకుంటాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన వైభవ్, తన దూకుడైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా, గుజరాత్ టైటాన్స్‌పై అతను సాధించిన సెంచరీ అతని అద్భుత ప్రతిభకు నిదర్శనం.

వైభవ్ భవిష్యత్తుపై కోచ్ అశోక్ కుమార్ ఏమన్నాడంటే?

కోచ్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. “నా అంచనా ప్రకారం, వైభవ్ తన ఫిట్‌నెస్‌ను, ఫీల్డింగ్‌ను మెరుగుపరుచుకుంటే, రాబోయే రెండేళ్లలో అతను భారత సీనియర్ టీ20 జట్టులో ఉంటాడు. బీసీసీఐ అతనికి అవకాశం ఇస్తుందని నేను నిజంగా భావిస్తున్నాను. ఎందుకంటే, ప్రస్తుత టీ20 జట్టులో ఒకటి, రెండు ఆటగాళ్లను మినహాయిస్తే, మిగిలినవారంతా 25 లేదా అంతకంటే తక్కువ వయసు వారే” అని ఐఎన్‌ఎస్‌తో అన్నారు.

“పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచీ జట్టును ఒంటరిగా గెలిపించాలనే ఆటిట్యూడ్ అతనిలో ఉంది. గుజరాత్ టైటాన్స్‌పై అతను సాధించిన 35 బంతుల సెంచరీలో కూడా ఇది స్పష్టంగా కనిపించింది. రాహుల్ ద్రవిడ్ సర్, విక్రమ్ రాథోడ్ సర్ తో కలిసి పనిచేయడం అతని బ్యాటింగ్‌ను మరింత మెరుగుపరిచింది. అతను తెల్ల బంతితో చేసిన ప్రాక్టీస్, మూడు నెలల్లోనే అతన్ని మరింత మెరుగుపరుచుకుంది. పరిస్థితులను అర్థం చేసుకొని ఆడే విధానాన్ని అతను నేర్చుకున్నాడు” అని అశోక్ కుమార్ వివరించారు.

ఇవి కూడా చదవండి

అద్భుత ప్రదర్శనలు, అపారమైన కృషి..

బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్ సూర్యవంశీ, కేవలం 12 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి, రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత అండర్-19 టెస్టుల్లో ఆస్ట్రేలియాపై వేగవంతమైన సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ అతన్ని రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో అతను ఏడు మ్యాచ్‌లలో 252 పరుగులు సాధించాడు, ఇందులో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 206.56.

అశోక్ కుమార్, వైభవ్ అండర్-19 బీహార్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. అలాగే సీనియర్ బీహార్ జట్టుకు కూడా కోచ్‌గా ఉన్నారు. ఐపీఎల్‌లో అతని ప్రదర్శనల తర్వాత, వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత అండర్-19 జట్టులో చోటు సంపాదించుకున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..