IPL 2025 షెడ్యూల్ ప్రకటన.. KKR – RCB మధ్య మొదటి మ్యాచ్ ఎప్పుడంటే?

ఐపీఎల్ 2025 షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. వచ్చే నెల అంటే మార్చ్ 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్లు షురూ కానున్నాయి. మొత్తం 74 మ్యాచ్ ల షెడ్యూల్ వచ్చేసింది. మరి తొలి మ్యాచ్ ఎప్పుడు? ఎవరి మధ్య జరుగబోతుందో చూద్దాం..

IPL 2025 షెడ్యూల్ ప్రకటన.. KKR - RCB మధ్య మొదటి మ్యాచ్ ఎప్పుడంటే?
Ipl

Updated on: Feb 16, 2025 | 6:29 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. IPL 2025 మొదటి మ్యాచ్ మార్చ్‌ 22న కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌ మార్చి 25న జరుగుతుంది. మొత్తం 13 నగరాల్లో 10 జట్ల మధ్య 74 మ్యాచ్‌లు జరుగుతాయి. వీటిలో ప్లేఆఫ్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. లీగ్ మ్యాచ్‌లు మార్చి 22 నుండి మే 18 వరకు జరుగుతాయి.