
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్ జట్టు 5 విజయాలతో మొత్తం 11 పాయింట్లు సాధించింది. ఈ పాయింట్లతో, శ్రేయాస్ అయ్యర్ జట్టు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. అయితే పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ భారత ఆటగాళ్లను విస్మరిస్తున్నారంటూ టీమిండియా మాజీ ఆటగాడు మనోజ్ తివారీ సంచలన కామెంట్స్ చేశాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో KKRతో జరిగిన మ్యాచ్‌లో, పాంటింగ్ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను విస్మరించి విదేశీ ఆటగాళ్లను బ్యాటింగ్‌కు పంపాడు. ఈ వ్యూహాల గురించి మనోజ్ తివారీ ప్రశ్నలు లేవనెత్తారు. ‘ఇది ఇలాగే కొనసాగితే ఈ సీజన్‌లో కూడా పంజాబ్ కింగ్స్ జట్టు ట్రోఫీని ఎత్తే అవకాశం లేదు. ఎందుకంటే అది వారి వ్యూహంగా కనిపిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, వారు ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు బదులుగా పేలవమైన ఫామ్‌లో ఉన్న బ్యాటర్లను రంగంలోకి దించారు. ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ నేహాల్ వాధేరా, శశాంక్ సింగ్‌లను బ్యాటింగ్‌కు పంపలేదు. బదులుగా, వారు తమ విదేశీ ఆటగాళ్లను విశ్వసించారు. దీన్ని బట్టి వారు భారత ఆటగాళ్లను నమ్మడం లేదని స్పష్టమవుతోంది. ఇలాగే కొనసాగితే పంజాబ్ కింగ్స్ టాప్ 2లో కనిపించినా టైటిల్ గెలవలేం’ అని మనోజ్ తివారీ తెలిపాడు.
కాగా కేకేఆర్ తో మ్యాచ లో రికీ పాంటింగ్ వ్యూహాన్ని మనోజ్ తివారీ తప్పు పట్టాడు. ఫామ్ లో లేని మ్యాక్స్ వెల్ కు పదే పదే అవకాశాలు ఇవ్వడం కొనసాగించడం పట్ల అసహనం వ్యక్తం చేశాడు. మాక్స్వెల్ నిరంతరం వైఫల్యాలు ఎదుర్కొంటున్నప్పటికీ అతనికి అవకాశం ఇవ్వడం, అదే సమయంలో భారత ఆటగాళ్లను విస్మరిస్తున్నారంటూ రికీపై ధ్వజమెత్తాడు . పాంటింగ్ తనకు కావలసిన ఆటగాళ్లతో వ్యూహరచన చేస్తే, పంజాబ్ కింగ్స్ మూల్యం చెల్లించుకుంటుంది. దీని అర్థం ట్రోఫీని గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉందని మనోజ్ తివారీ హెచ్చరించారు.
Manoj Tiwary drops a bold take! 🎯
Says Punjab Kings might miss out on the IPL 2025 title because of Ricky Ponting’s “over-reliance” on overseas players. 👀🔥#IPL2025 #PBKS pic.twitter.com/ZVZBhVWUVD
— Rio (@CricRio6) April 27, 2025
KKRతో జరిగిన ఈ మ్యాచ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ 8 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత మార్కో జాన్సెన్‌ను కూడా రంగంలోకి దించారు. దీని తర్వాత జోష్ ఇంగ్లిస్ బ్యాటింగ్ కు వచ్చాడు. అయితే, మంచి ఫామ్‌లో ఉన్న నెహాల్ వాధేరా, శశాంక్ సింగ్‌లను బ్యాటింగ్‌కు దింపలేదు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..