IPL 2025 Points Table: 12 ఏళ్ల పగ.. తెలుగోడి తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఇచ్చిపడేసిన హైదరాబాద్

IPL 2025 Points Table Update After CSK vs SRH Match: ఐపీఎల్-18లో జరిగిన 43వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో CSKకి ఇది ఏడో ఓటమి. ఈ ఓటమితో చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం కష్టతరంగా మారింది. చెన్నై జట్టు ఇప్పుడు ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సి ఉంటుంది. అలాగే, ఇతర జట్లపై కూడా ఆధారపడవలసి ఉంటుంది.

IPL 2025 Points Table: 12 ఏళ్ల పగ.. తెలుగోడి తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఇచ్చిపడేసిన హైదరాబాద్
Csk Vs Srh Ipl 2025

Updated on: Apr 26, 2025 | 6:33 AM

IPL 2025 Points Table Update After CSK vs SRH Match: ఐపీఎల్ (IPL) 2025 సీజన్‌లో భాగంగా 43వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 154 పరుగులకే ఆలౌట్ అయింది. దీనికి ప్రతిస్పందనగా, హైదరాబాద్ జట్టు 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేరుకుంది. దీంతో చెన్నై ఐపీఎల్ 2025 సీజన్ నుంచి దాదాపు తప్పుకున్నట్లేనని తెలుస్తోంది. తొమ్మిదవ మ్యాచ్‌లో చెన్నై ఏడో ఓటమిని చవిచూసింది. చెన్నై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో పరిస్థితి ఎలా ఉందో ఓసారి చూద్దాం..

చెన్నై పని ఖతం..

ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో, గుజరాత్ జట్టు ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు, చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిదవ మ్యాచ్‌లో ఏడో ఓటమి తర్వాత పదో స్థానంలో కొనసాగుతోంది. కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తన మూడో విజయంతో తొమ్మిదవ స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి చేరుకుంది. ఇప్పుడు చెన్నై జట్టుకు ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఐదు మ్యాచ్‌లలో గెలిచినా, ఆ జట్టు ముందున్న మార్గం కష్టంగా ఉండబోతోంది.

IPL 2025 పాయింట్ల పట్టిక..

జట్టు మ్యాచ్ విజయాలు ఓటమి నెట్ రన్ రేటు పాయింట్లు
1. గుజరాత్ టైటాన్స్ 8 6 2 1.104 12
2. ఢిల్లీ క్యాపిటల్స్ 8 6 2 0.657 12
3. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 6 3 0.482 12
4. ముంబై ఇండియన్స్  9 5 4 0.673 10
5. పంజాబ్ కింగ్స్ 8 5 3 0.177 10
6. లక్నో సూపర్ జెయింట్స్ 9 5 4 -0.054 10
7. కోల్‌కతా నైట్ రైడర్స్ 8 3 5 0.212 6
8. సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 3 6 -1.103 6
9. రాజస్థాన్ రాయల్స్ 8 2 6 -0.633 4
10. చెన్నై సూపర్ కింగ్స్ 9 2 7 -1.302 4