PBKS vs RCB: తొలి క్వాలిఫయర్ -1కు వర్షం ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దయితే ఫైనల్ చేరేది ఎవరంటే?

Punjab Kings vs Royal Challengers Bengaluru, Qualifier 1: ఐపీఎల్ 2025 ప్లేఆఫ్ మ్యాచ్‌లు నేటి నుంచి అంటే మే 29 నుంచి ప్రారంభమవుతున్నాయి. క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. కానీ, మ్యాచ్ రద్దు అయితే మాత్రం బీసీసీఐ ప్రత్యేక నియమం ఉపయోగించనుంది.

PBKS vs RCB: తొలి క్వాలిఫయర్ -1కు వర్షం ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దయితే ఫైనల్ చేరేది ఎవరంటే?
Ipl 2025 Playoffs Rcb Vs Pb

Updated on: May 29, 2025 | 6:49 AM

IPL 2025 Playoffs Reserve Day: ఐపీఎల్ 2025 (IPL 2025) లో లీగ్ దశ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పుడు ప్లేఆఫ్ మ్యాచ్‌లు మే 29 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-1 మ్యాచ్ మొహాలీలోని ముల్లాన్‌పూర్ క్రికెట్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే, రెండు జట్లు ఫైనల్స్‌కు చేరుకోవడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, అతి పెద్ద ప్రశ్న ఏమిటంటే ఈ మ్యాచ్ వర్షం వల్ల లేదా మరేదైనా కారణం వల్ల రద్దు అయితే, ఏ జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ప్లేఆఫ్‌ల కోసం బీసీసీఐ ప్రత్యేక నియమాలను రూపొందించిందా లేదా అనేది తెలుసుకుందాం..

క్వాలిఫయర్-1 రద్దు చేఅయితే, ఫైనల్‌లో ఎవరు ఆడతారు?

ఐపీఎల్ (IPL) క్వాలిఫైయర్-1 అనేది ప్లేఆఫ్స్‌లో మొదటి పెద్ద దశ, దీనిలో లీగ్ దశలో టాప్-2 జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు ప్రవేశిస్తుంది. ఓడిపోయిన జట్టుకు క్వాలిఫైయర్-2లో మరో అవకాశం లభిస్తుంది. ఆర్‌సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ రెండూ బలమైన జట్లు. ఈ సీజన్‌లో ఇరుజట్ల ప్రదర్శన అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఆర్‌సీబీ దూకుడు బ్యాటింగ్, సమతుల్య బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందింది. అయితే పంజాబ్ కింగ్స్ బలం తుఫాన్ బ్యాటింగ్, అనుభవజ్ఞులైన బౌలర్లలో ఉంది.

ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నమెంట్‌లో, వాతావరణం ఎల్లప్పుడూ ఒక సవాలుగా ఉంటుంది. అదే సమయంలో, క్వాలిఫైయర్-1 మ్యాచ్‌కు రిజర్వ్ డేను ఉంచలేదు. వర్షం, బ్యాడ్ వెదర్ లేదా మరేదైనా కారణం వల్ల ఈ మ్యాచ్ రద్దు అయితే, ఒక జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ పరిస్థితిలో, లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఆధిక్యాన్ని పొందుతుంది. ఫైనల్‌కు టికెట్ పొందుతుంది. లీగ్ దశలో పంజాబ్ మొదటి స్థానంలో నిలవగా, ఆర్‌సీబీ రెండవ స్థానంలో నిలిచింది. దీని అర్థం క్వాలిఫయర్-1 రద్దు అయితే పంజాబ్ ఫైనల్‌కు చేరుకుంటుంది. బెంగళూరు క్వాలిఫయర్-2 ఆడవలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

లీగ్ దశలో రెండు జట్ల ప్రదర్శన..

ఐపీఎల్ 2025 లీగ్ దశలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల ప్రదర్శన ఇతర జట్ల కంటే చాలా మెరుగ్గా ఉంది. పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్‌ల్లో 9 గెలిచి, 4 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. అయితే, ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. మరోవైపు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా లీగ్ దశలో 9 మ్యాచ్‌ల్లో గెలిచి 4 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. కానీ, నెట్ రన్ రేట్ కారణంగా, అది పంజాబ్ కంటే వెనుకబడిపోయింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..